Tuesday, September 27, 2022
Homeటాప్ స్టోరీస్`క‌ప‌ట‌ధారి` మూవీ రివ్యూ

`క‌ప‌ట‌ధారి` మూవీ రివ్యూ

Kapatadhaari Movie Telugu Review
Kapatadhaari Movie Telugu Review

న‌టీన‌టులు:  సుమంత్‌, నందితా శ్వేతా, సుమ‌న్ రంగ‌నాథ‌న్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్‌, సంప‌త్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.
ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌దీప్ కృష్ణ‌మూర్తి
స్క్రీన్‌ప్లే అనుక‌ర‌ణ :  డా. జి. ధ‌నుంజ‌య‌న్‌
నిర్మాత‌: ల‌లిత ధ‌నుంజ‌య‌న్‌
సంగీతం:  సైమ‌న్ కె. కింగ్‌
ఎడిటింగ్ : ప‌్ర‌వీణ్ కె.ఎల్‌
రిలీజ్ డేట్: ‌19- 02 – 2021
రేటింగ్ : 2.5/5

- Advertisement -

తెలుగు క‌థ‌లు బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌.. సాండ‌ల్ వుడ్‌..ఇలా ఇత‌ర భాష‌ల్లో రీమేక్ అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా క‌న్న‌డ నుంచి తెలుగు తెర‌పైకి వ‌స్తున్న క‌థ‌లు కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా క‌న్న‌డలో `క‌వ‌లుధారి`‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. అదే చిత్రాన్ని తెలుగులో సుమంత్ హీరోగా `క‌ప‌ట‌ధారి` పేరుతో రీమేక్ చేశారు. కొంత విరామం త‌రువాత సుమంత్ న‌టించిన చిత్రం కావ‌డం.. ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకోవ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాల్ని పెంచాయి. మ‌ర్డ‌ర్ మిస్టరీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలోనే వుందా?  లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:

గౌత‌మ్ (సుమంత్‌) ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ గా ప‌రిచేస్తుంటాడు. అత‌నికి క్రైమ్ విభాగంలోకి వెళ్లాల‌నేది క‌ల‌. కానీ పై అధికారి అందుకు ఒప్పుకోరు. అసంతృప్తితో విధులు నిర్వ‌హిస్తున్న అత‌ని ప‌రిధిలోనే ఓ కుటుంబానికి చెందిన అస్తిపంజ‌రాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. అవి న‌ల‌భై ఏళ్ల క్రితం జ‌రిగిన హ‌త్యల‌ని తేలుతుంది. క్రైమ్ విభాగానికి చెందిన పోలీసులు ఆ కేసుని మూసివేసే ఆలోచ‌న‌లో వుండ‌గా గౌత‌మ్ ఆ హ‌త్య‌ల వెన‌కున్న నిజాల్ని బ‌య‌టికి తీసే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడ‌తాగు. ఈ క్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న స‌వాళ్లేంటీ? ..ఇంత‌కీ ఆ హ‌త్య‌ల్ని న‌ల‌భై ఏళ్ల క్రితం ఎవ‌రు చేశారు?  గౌత‌మ్ హంత‌కుల్ని ప‌ట్టుకున్నాడా? క‌్రైమ్ విభాగంలోకి వెళ్లాల‌న్న గౌత‌మ్ కల నెర‌వేరిందా? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు:

క‌థ‌నాయ‌కుడు సుమంత్ పోలీస్ పాత్ర‌లో ఒదిగిపోయారు. కానీ ఆ పాత్ర‌ని తీర్చి దిద్దిన విధానంలో మాత్రం లోపాలు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించాయి. థ్రిల్ల‌ర్ సినిమాల్లో వుండే ఇంటెన్సిటీ తో సాగుతాయి. కానీ ఈ చిత్రంలోని హీరో పాత్ర‌లో అది లోపించింది. నాజ‌ర్, జ‌య‌ప్ర‌కాష్ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.  క‌థానాయిక నందితా శ్వేత పాత్ర‌కు ప్రాధాన్యం లేదు. వెన్నెల కిషోర్ ప్ర‌ధ‌మార్థంలో న‌వ్వించాడు. సాంకేతికంగా సినిమా ఫ‌ర‌వాలేద‌నిపిస్తుంది.

సాంకేతిక నిపుణుల ప‌ని తీరు:

కెమెరా విభాగాలు చ‌క్క‌ని ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. సైమ‌న్ కె. కింగ్ సంగీతం, నేప‌థ్య సంగీతం, ర‌స‌మ‌తి ఛాయాగ్ర‌హ‌ణం ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. నిర్మాణ ప‌రంగా చాలా ప‌రిమితుల‌కు లోబ‌డి ఈ చిత్రాన్ని నిర్మించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ప‌నిత‌నం కొన్ని చోట్ల మాత్ర‌మే ఆక‌ట్టుకునే విధంగా వుంది. క‌థ‌లో అత్యధికంగా థ్రిల్లింగ్ ఎలామెంట్స్ వున్న‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు ఏ మాత్రం ప‌ట్టుని సాధించ‌లేక‌పోవ‌డం ఈ మూవీకి పెద్ద మైన‌స్‌గా నిలిచింది. ప్ర‌ధ‌మార్థం, నిదానంగా సాగే స‌న్నివేశాలు కూడా సినిమాకు ప్ర‌ధాన మైన‌స్‌గా నిలిచాయి.

తీర్పు:

తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త క‌థ‌ల‌కు ప‌ట్టం క‌డుతున్న విష‌యం తెలిసిందే. కానీ ఆ క‌థ‌లు ఆస‌క్తిక‌రంగా వుంటేనే ఆద‌రిస్తున్నారు. ఈ విష‌యంలో `క‌ప‌ట‌ధారి` ఫెయిల‌య్యాడ‌ని చెప్పొచ్చు. ఆక‌ట్టుకునే పాయింట్‌, ఆస‌క్త‌క‌ర‌మైన ట్విస్ట్‌లు వున్నా వాటిని ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధింగా వారిని థ్రిల్ చేసేలా మ‌ల‌చ‌డంలో ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ఫెయిల‌య్యాడు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts