Homeటాప్ స్టోరీస్కల్కి చేతుల నుండి కథ సత్యం దగ్గరికి వెళ్లి పోయింది

కల్కి చేతుల నుండి కథ సత్యం దగ్గరికి వెళ్లి పోయింది

కల్కి చేతుల నుండి కథ సత్యం దగ్గరికి వెళ్లి పోయింది
కల్కి చేతుల నుండి కథ సత్యం దగ్గరికి వెళ్లి పోయింది

‘పి.ఎస్.వి గరుడ వేగ 126.18M’ సినిమాతో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పిలవబడే ‘డా.రాజశేఖర్’ గారు రెండవ ఇన్నింగ్స్ ని మళ్ళీ తన నటనతో తిరిగి ఫార్మ్ లోకి తెచ్చుకున్నారు. ఆధ్యంతం ఆసక్తికరంగా సాగే ఆ సినిమాలో మొత్తం తానే అయ్యి భుజాల మీద సినిమాని నడిపించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా మనం రెగ్యులర్ గా చూసే సినిమాల కంటే విభిన్నంగా ఉండడంతో మంచి విజయం దక్కింది సినిమాలో పని చేసిన వారందరికీ.

ఇకపోతే గరుడ వేగ సినిమా తర్వాత కొంచెం సమయం తీసుకున్న రాజశేఖర్ గారు సినిమాలా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ‘అ’ సినిమా దర్శకులు అయిన ‘ప్రశాంత్ వర్మ’ దర్శకత్వంలో ‘కల్కి’ సినిమాని మన ముందుకి తీసుకు వచ్చారు. కల్కి సినిమా విమర్శకులకి బాగా నచ్చింది కానీ విజయం దక్కించుకోలేక పోయింది. కల్కి సినిమా తర్వాత మళ్ళీ కొంచెం సమయం తీసుకున్న రాజశేఖర్ గారు ఈ సారి థ్రిల్లర్ జానర్ లో సినిమా చెయ్యాలి అని కథలు వినటం మొదలు పెట్టారు. అలా ఒక తమిళ సినిమా దర్శకులు చెప్పిన కథ విన్నారు.

- Advertisement -

తమిళ దర్శకులు చెప్పిన ఆ కథ కూడా కన్నడ సినిమాకి మాతృక అయిన ‘కవలుదారీ’ సినిమా కథ అది. కవలుదారీ సినిమా కన్నడంలో మంచి విజయం సాధించింది. రాజశేఖర్ గారు కూడా కథ మొత్తం విన్నారు. ఈ కథ మనం చేస్తున్నాం అని దర్శకుడికి మాట కూడా ఇచ్చారు. సడెన్ గా ఏమైందో ఏమో తెలీదు కానీ రాజశేఖర్ గారు చెయ్యాల్సిన హీరో పాత్రలోకి ‘సత్యం’ సినిమా కథానాయకులు అక్కినేని కుటుంబం నుండి వచ్చిన ‘సుమంత్‘ గారు వచ్చారు. ‘మళ్ళీ రావా’ సినిమా ద్వారా తన రెండవ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన సుమంత్ గారు ఆ సినిమా విజయం తర్వాత పూర్తిగా కథల విషయంలో కేరింగ్ గా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే వివిధ రకాలైన సినిమా కథలని ఎంచుకుంటూ ముందుకి వెళ్లిపోతున్నారు.

అలా రాజశేఖర్ గారి దగ్గర నుండి సినిమా సుమంత్ చేతుల దగ్గరికి వెళ్లినందుకు చాలా రకాలుగా గుస గుసలు వినిపిస్తున్నాయి కానీ వాటిలో ఏది నిజమో? ఏది అబద్దమో ప్రస్తుతానికి అయితే అన్ని గుట్టుగా జరిగిపోతున్నాయి. మున్ముందు అయిన వార్తలు వస్తాయేమో చూడాలి ఈ సినిమా విషయంలో…

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All