Thursday, December 8, 2022
Homeటాప్ స్టోరీస్కన్నడ హీరో అందుకు సై అంటాడా?

కన్నడ హీరో అందుకు సై అంటాడా?

కన్నడ హీరో అందుకు సై అంటాడా?
కన్నడ హీరో అందుకు సై అంటాడా?

కన్నడం లో హీరోగా సంచలన విజయాల్ని సొంతం చేసుకున్న హీరో సుదీప్. ‘ఈగ’ సినిమాతో టాలీవుడ్ లో రచ్చ చేసిన సుదీప్ కు తాజాగా  భారీ ఆఫర్ లభించినట్టు తెలిసింది. తనదైన విలనిజంతో ఆకట్టుకున్న సుదీప్ మళ్ళీ తెలుగులో అదే తరహా లో బిగ్ ఆఫర్ లభించినట్టు తెలిసింది.

మహేష్ బాబు హీరోగా ‘సర్కారు వారి పాట‘ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.
భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై సెటైరికల్ గా  ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధాన విలన్ గా సుదీప్ ని దర్శకుడు పరశురామ్ సంప్రదించినట్టు వినిపిస్తోంది.  ఈ ఆఫర్ని సుదీప్ ఒకే చెబుతాడా ? అన్నది వేచిచూడాల్సిందే.
- Advertisement -

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts