Homeటాప్ స్టోరీస్నటి నికిత మృతి

నటి నికిత మృతి

kannada actress nikita diedకన్నడ నటి నికిత (30) నిన్న రాత్రి మరణించింది . పలు సీరియల్ లలో నటించిన నికిత పలు చిత్రాల్లో కూడా నటించింది అయితే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది మాత్రం బుల్లితెర పైనే . అయితే నిన్న ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో తలకు బలమైన గాయం అయ్యింది వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది . ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచింది .

రెండేళ్ల కిందటే నటుడు లిపన్ సాహు ని పెళ్లి చేసుకుంది నికిత . సీరియల్ లలో నటిస్తూ బాగా పేరు సంపాదిస్తున్న సమయంలో అర్దాంతరంగా చనిపోవడంతో కన్నడనాట విషాద ఛాయలు అలుముకున్నాయి . నికిత మృతి వార్త ఆలస్యంగా తెలియడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆమె సన్నిహితులు . గాయాలతో ఆసుపత్రిలో చేరింది కదా ! మళ్ళీ కోలుకొని వస్తుంది అని అనుకుంటున్న సమయంలో ఇలా దుర్వార్త వినాల్సి వచ్చిందంటూ దుఃఖ సాగరంలో మునిగారు .

- Advertisement -

English Title:kannada actress nikita died

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All