
బాలీవుడ్‌లో డ్రగ్స్ వివాదం సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తోంది. సుశాంత్ అనుమానాస్పద మరణం తరువాత డ్రగ్స్ వివాదం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. రియాని అదుపులోకి తీసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అధికారులు ఆ తరువాత ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా అరెస్ట్ చేయడంతో కీలక విషయాలు బయటికి రావడం మొదలైంది.
ఈ కేసులో తామే కాదు బాలీవుడ్‌కు చెందిన క్రేజీ స్టార్లు కూడా వున్నారని రియా ఆమె సోదరుడు వెల్లడించడంతో తీక లాగితే డొంక కదిలిన చందంగా బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ లో ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. తాజాగా ఈ వివాదంలో నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ అధికారులు సమన్లు అందించడం ఆసక్తికరంగా మారింది. ఇందులో రకుల్, దీపిక, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ సమన్లు అందుకున్న వారిలో వున్నారు. శుక్రవారం రకుల్, దీపిక మేనేజర్ కరిష్మా విచారణకు హాజరు కాగా శనివారం దీపిక హాజరైంది. ఈ సందర్భంగా ఆమె కర్ష్మాతో చాట్ చేసిన వాట్సాప్ చాట్ బయటికి వచ్చిందని ఆమె సెట్ ఫోన్‌ని ఎన్సీబీ అధికారులు సీజ్ చేసినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో దీపికపై కంగన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మాదక ద్రవ్యాల మొక్క వినియోగం. హై సొసైటీకి చెందిన పిల్లలమని చెప్పుకునే వారి మేనేజర్‌ని `మాల్ హై క్యా ` ని అడగండి #boycottBollywoodDruggies #DeepikaPadukone అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియా వేదికగా కంగన సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.