Homeగాసిప్స్న్యూడ్ సినిమాను రీమేక్ చేయబోతున్న బోల్డ్ బ్యూటీ

న్యూడ్ సినిమాను రీమేక్ చేయబోతున్న బోల్డ్ బ్యూటీ

న్యూడ్ సినిమాను రీమేక్ చేయబోతున్న బోల్డ్ బ్యూటీ
న్యూడ్ సినిమాను రీమేక్ చేయబోతున్న బోల్డ్ బ్యూటీ

ఒకప్పుడు బాలీవుడ్ వారికి సౌత్ సినిమాలంటే బాగా చిన్న చూపు ఉండేది. సౌత్ లో కేవలం మాస్ మసాలా సినిమాలే తెరకెక్కిస్తారు అని కౌంటర్ లు కూడా వేసుకుని ఆనందపడిపోయేవారు బాలీవుడ్. సౌత్ లో తొడ కొట్టడం, మీసం తిప్పడం, గాల్లోకి ఎగిరే ఫైట్లు చేయడం, ఆడ్ కలర్స్ ఉన్న బట్టలు వేసుకోవడం అంటూ పంచ్ లు వేసుకునేవారు. అయితే గత కొన్నేళ్ల నుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ వాళ్ళు సౌత్ సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సౌత్ హీరోలంటే ఇంకా మంచి అభిప్రాయం కలిగిందో లేదో కానీ సౌత్ సినిమాలన్నా, సౌత్ దర్శకులన్నా ప్రత్యేక గౌరవం ఏర్పడింది.

ఇది ఎంతలా ఉందంటే సౌత్ నుండి ఏదైనా ప్రత్యేకమైన సినిమా వచ్చిందంటే చాలు బాలీవుడ్ వాళ్ళు రీమేక్ రైట్స్ కొనేస్తున్నారు. అవసరమైతే సౌత్ లో తీసిన దర్శకుడి చేతే హిందీలో కూడా సినిమా చేయించేస్తున్నారు. రోబో, బాహుబలి, సాహో, కేజిఎఫ్ వంటి సినిమాలు అక్కడ కూడా ఆదరణ పొందడానికి కారణమిదే. లేటెస్ట్ గా సౌత్ నుండి బాలీవుడ్ కు వెళుతున్న చిత్రం ఆడై. తెలుగులో ఆమె గా విడుదలైందీ చిత్రం. అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం కమర్షియల్ గా గొప్ప విజయం సాధించలేదు కానీ స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న చిత్రం ఆమె. ముఖ్యంగా అమలా పాల్ ఈ చిత్రం కోసం బాగా కష్టపడింది.

- Advertisement -

ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. దాదాపు గంటపాటు అమలా పాల్ న్యూడ్ గా నటించింది. డైరెక్ట్ గా చూపించకపోయినా న్యూడ్ గా నటించిందనే భావన తీసుకురాగలిగారు. సెట్స్ లో మాత్రం కొన్ని సీన్స్ లో నిజంగానే ఈ భామ న్యూడ్ గా నటించినట్లు చెప్పింది. కాన్సెప్ట్ పరంగా విమర్శకుల నుండి ప్రశంసలు దక్కినా కానీ కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇలాంటి సినిమాలు ఎక్కడ బాగా ఆడతాయో అక్కడికే వెళుతోంది ఆడై. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్ ఈ సినిమాను బాలీవుడ్ లో తీసే ప్రయత్నాలు చేస్తున్నాడు. బాలీవుడ్ లో ఇలాంటి చిత్రాలను తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతో రీమేక్ రైట్స్ కూడా కొనుగోలు చేసాడు.

ఇలాంటి బోల్డ్ పత్రాలు చేయడానికి బాలీవుడ్ లో చాలా మందే ఉన్నా, నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో కంగనా అయితే పూర్తిగా న్యాయం చేయగలదని బాలీవుడ్ సర్కిల్స్ లో ప్రముఖంగా వినిపిస్తోంది.బోల్డ్ సినిమా కాబట్టి కంగనా కూడా కచ్చితంగా ఓకే అంటుందని అందరూ అనుకుంటున్నారు. అయితే కంగనా అయితే స్క్రిప్ట్ లో ఎక్కువ కలగజేసుకుంటుందని టాక్ ఉంది. విక్రమ్ భట్ వంటి సీనియర్ దర్శకుడు కంగనాను ఎలా హ్యాండిల్ చేస్తాడో అన్నది ఆసక్తికరం. అయినా ముందు కంగనా ఈ చిత్రానికి ఓకే చెప్పాలి కదా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All