
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఏ విషయాన్నీ సాఫీగా వదలడం లేదు. ప్రతీ అంశాన్నీసీరియస్‌గానే తీసుకుంటున్నారు. చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూస్తూ చురకలంటిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై ఏదో ఒక రోజు నీ అహంకారం అణుగుతుంది అంటూ సంచలనం సృష్టించిన కంగన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతిపై కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా తన ఫాలోవర్స్ పై కూడా ఘాటుగా స్పందించి షాకిచ్చింది. ఇండియన్ ఫిల్మ్ సెలబ్రిటీల్లో సోషల్ మీడియాలో కంగన వున్నంత యాక్టీవ్‌గా ఏ సెలబ్రిటీ వుండరు అన్నది తెలిసిందే. అయితే ప్రతీ ట్వీట్‌ని సంచలనంగా మార్చాలని కంగన చూస్తున్న తీరుకు ఆమె ఫాలోవర్స్, ఫ్యాన్స్‌లోనూ విసుగొచ్చేస్తోంది. దీంతో ఆ విషయాన్ని కంగనకు చెప్పేశాడు ఓ ఫాలోవర్. ఇప్పటికైనా సైలెంట్ అయితే బాగుంటుందేమో అని సలహా ఇచ్చాడు.
దీంతో కంగనకు చిర్రెత్తుకొచ్చింది. `తన ట్విట్టర్ ఖాతాను రోజంతా చెక్ చేసే అభిమానులకు బోరు కొట్టినా.. విసుగనిపించినా.. నా ట్వీట్‌లు చూసి అలసిపోయినా మ్యూట్ చేసుకోవచ్చని, అదీ కుదరని పక్షంలో తనని బ్లాక్ కూడా చేసుకోవచ్చని సలహా ఇచ్చింది. తనని ద్వేషిస్తూ ప్రేమించవద్దని, ఇంత కన్నా బెటర్ ఏదైనా అనిపిస్తే అదే చూసుకుంటే బాగుంటుందని స్పష్టం చేసింది. ఓవరాల్‌గా తను మారనని, తనని సైలెంట్‌గా వుండమని అనేవాళ్లు భరించలేకపోతే మూసుకోమని కంగన ఇండైరెక్ట్‌గా చెప్పడంతో నెటిజన్స్ అవాక్కవుతున్నారు.
All the fans who keep checking my tweets all day and keep declaring they are bored/tired and ask me to stay quiet should Mute/unfollow or Block me, if you don’t then you are clearly obsessed. Don’t love me like a hater but if you don’t know any better then go for it ?
Love❤️— Kangana Ranaut (@KanganaTeam) November 9, 2020