Homeటాప్ స్టోరీస్“ఆడ పిల్ల” కాదు.! “ఆడే పులి కథ”- “పంగా” రివ్యూ

“ఆడ పిల్ల” కాదు.! “ఆడే పులి కథ”- “పంగా” రివ్యూ

“ఆడ పిల్ల” కాదు.! “ఆడే పులి కథ”- “పంగా” రివ్యూ
“ఆడ పిల్ల” కాదు.! “ఆడే పులి కథ”- “పంగా” రివ్యూ

భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఆడే ఒకానొక ఆట కబడ్డీ. ఒక్కసారి కూత పెట్టి, అవతల కోర్టులోకి వెళ్ళామంటే, ఒళ్ళంతా కళ్ళతో అనుక్షణం గమనిస్తూ, గడువు ముగిసేలోగా వీలైనంత మందిని అవుట్ చేసి, ఒకవేళ అందరూ కలిసి చుట్టుముడితే, చివరివరకూ పాయింట్ కోసం ప్రయత్నించి చేసే యుద్ధమే కబడ్డీ. అలాంటి పోరాట క్రీడ మగవాళ్ళకే పరిమితం కాదు. ఆడవాళ్ళూ కూడా ఆడతారు. అలాంటి మహిళా క్రీడాకారిణి జయా నిగమ్ నిజజీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా “పంగా”. నటి కంగన రనౌత్ ఈ సినిమాలో జయ పాత్రలో నటించారు. ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మొదటి ఆట నుండే మెప్పించి, హిట్ టాక్ దిశగా దూసుకెళ్తోంది.

ఇక సినిమా కథ విషయానికి వస్తే జయా నిగమ్ ఒక బ్యాంక్ ఉద్యోగిని. గతంలో జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్. పెళ్లి అయిన తరువాత ఒక గృహిణిగా, ఒక తల్లిగా తన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయిన తరుణంలో మరొకసారి ఆమె కబడ్డీ ఆడాలనుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది.? ఆమె కుటుంబం, సమాజం, సాటి మనుషులు ఆమెను ఎలా రిసీవ్ చేసుకున్నారు.? సాధారణంగా ప్లేయర్స్ రిటైర్మెంట్ ఇచ్చే వయసులో మళ్ళీ తను ఎంట్రీ ఇచ్చి ఎలా సక్సెస్ అయ్యింది.? ఒకసారి నేషనల్ ఛాంపియన్ అయిన మహిళ, మళ్ళీ 32 ఏళ్ళ వయసులో మధ్యప్రదేశ్ భోపాల్ నుండి ఇండియా నేషనల్ టీం చేసిన జర్నీ.? అసలు మన సమాజంలో ఎంత సాధించినా ఒక ఆడపిల్ల ప్రతీ స్థాయిలో ఎదుర్కోవలసిన సవాళ్ళు ఏంటి.?

- Advertisement -

ఇలా అనేక విషయాలను భావోద్వేగభరితంగా చూపించారు దర్శకురాలు అశ్వినీ అయ్యర్. ఆమె గతంలో కూడా “బరేలి కీ బర్ఫీ” సినిమాతో మన ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాను మొదటినుండి చివరివరకూ తన భుజాలపై మోశారు కంగనా.ఆమె ప్రతిభకు ఈ సినిమా ఒక ఉదాహరణ. తనను ఎందుకు బాలీవుడ్ క్వీన్ అంటారో.? ఇలాంటి సినిమాలు చూస్తే మనకు అర్ధం అవుతుంది. ఇక మిగిలిన పాత్రలలో మీను (రిచా చడ్డా), ప్రశాంత్ (జెస్సి గిల్) చెప్పుకోదగ్గవి. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మీరు కూడా “పంగా” సినిమా చూసెయ్యండి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All