
రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలు గా నటించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) భారీ అంచనాల మధ్య శుక్రవారం వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి , ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు రాజమౌళి ప్రతిభ ఫై , ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటన ఫై ప్రశంసలు కురిపిస్తున్నాయి. బాలీవుడ్ లోని నటులు , దర్శకులు సినిమా ఫై కామెంట్స్ చేస్తుండగా..తాజాగా కంగనా తనదైన స్టయిల్ లో కామెంట్స్ చేసింది.
కంగనా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ‘ఎస్‌ఎస్ రాజమౌళి సార్ భారతీయ చలనచిత్ర దర్శకుడని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటివరకూ ఆయన ఒక్క ఫ్లాప్ సినిమా కూడా తీయలేదు. ఆయన తీసిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ అందుకున్నాయి’ అంటూ రాసుకొచ్చింది. అలాగే మరో స్టోరీలో .. ‘అయితే ఇక్కడ చెప్పుకునే గొప్ప విషయం ఆయన విజయాల గురించి కాదు. ఆయనలోని వినయం, సరళత, ఓ వ్యక్తిగా దేశంపై, నమ్ముకున్న ధర్మంపై ఆయనకున్న ప్రేమ చాలా గొప్పవి. మీలాంటి రోల్ మోడల్ ఉండడం మా అదృష్టం సార్.. నిజాయితీగా నేను మీ అభిమానిని’ అంటూ రాసుకొచ్చింది. కంగనా కామెంట్స్ పట్ల అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు .