
కరోనా దెబ్బకి చాలా మంది విలవిలలాడిపోతున్నారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కరోనా భయం ఎవరినీ వీడటం లేదు. పైగా దాని కారణంగా చాలా మంది పని కోల్పోతున్నారు. మాల్స్, థియేటర్స్, బస్ స్టేషన్స్, రైల్వేస్టేషన్స్ అన్నీ బంద్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూని ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగించాలని వెల్లడించడంతో అంతా అందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో `కంచె` భామ ప్రగ్యా జైస్వాల్ స్వీయ క్వారెంటైన్‌కి వెళ్లిపోయింది.`కంచె` తరువాత ఆ స్థాయిలో మాత్రం అవకాశాల్ని సొంతం చేసుకోలేకపోయింది. సినిమాలే లేని ప్రగ్యా స్వీయ క్వారెంటైన్‌కి వెళ్లిపోవడం ఏంటని అంతా అవాక్కవుతున్నారు. విషయం ఏంటంటే సినిమాలు లేకపోయినా ప్రగ్యా జైస్వాల్ మాత్రం వరుస టూర్‌లు తిరుగుతూ తెగ ఎంజాయ్ చేసింది.
వెకేషన్‌ల పేరుతో మాల్దీవ్స్‌తో పాటు క్రేజీ స్పాట్‌లకు వెళ్లి అంతా తిరిగి వచచ్చింది. విదేశాల్లో తిరిగొచ్చిన వారికి కరోరా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రగ్యా జైస్వాల్ స్వీయ నిర్భంధంలోకి వెళుతున్నట్టు పెట్టిన పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
A great initiative by our Hon’ble PM @narendramodi ji..Let us abide by his decision by staying at home tomorrow 7am to 9pm..
And while we’re at it, let’s also honour the heroes who protect us by standing out on our balconies/doors & giving them a huge round of applause at 5pm???— Pragya Jaiswal (@ItsMePragya) March 21, 2020