Homeటాప్ స్టోరీస్క్యాస్ట్ పాలిటిక్స్‌కి క‌మ్మ ‌వ‌ర్గం స‌సెమిరా

క్యాస్ట్ పాలిటిక్స్‌కి క‌మ్మ ‌వ‌ర్గం స‌సెమిరా

క్యాస్ట్ పాలిటిక్స్‌కి క‌మ్మ ‌వ‌ర్గం స‌సెమిరా
క్యాస్ట్ పాలిటిక్స్‌కి క‌మ్మ ‌వ‌ర్గం స‌సెమిరా

తెలంగాణలో క్యాస్ట్ పాలిటిక్స్‌కి తెర‌లేసింది. ఈ నెల 14న ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌లు (ఎమ్మెల్సీ) జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో కుల స‌మీక‌ర‌ణాలు అప్ప‌డే మొద‌ల‌య్యాయి. హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ తెరాస అభ్య‌ర్థి శ్రీ‌మ‌తి సుర‌భి వాణిదేవి పోటీ చేస్తున్నారు. ఇక ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ అభ్య‌ర్తిగా ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి పోటీ ప‌డుతున్నారు.

అయితే ఈ పోటీలో కుల స‌మీక‌ర‌ణాలు ప్ర‌ధాన భూమిక పోషించ‌బోతున్నాయి. కుల సంఘాల‌ని రంగంలోకి దించితే ఈ ఇద్ద‌రి గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కే కానుంద‌ని గ్ర‌హించిన అధికార పార్టీ వెంట‌నే కుల సంఘాల‌ని రంగంలోకి దింపేసింది. ఇందులో భాగంగా ముందు ఖ‌మ్మ సంఘం పెద్ద‌ల్ని ముందదు లైన్‌లో పెట్టారు. వెంట‌నే ఈ ఇద్ద‌రికీ త‌మ అమూల్య‌మైన ఓటుని మ‌న కుల వ‌ర్గాలు వేయాలని కోరుతూ సంఘం పెద్ద‌లు ఓ ప్ర‌క‌ట‌న‌ని కూడా విడుద‌ల చేశారు.

- Advertisement -

అయితే ఇది న‌చ్చ‌ని అత్య‌ధిక శాతం మంది ఖమ్మ వ‌ర్గం కుల రాజ‌కీయాలకి తాము పూర్తి వ్య‌తిరేక‌మ‌ని, ఇందుకు తాము అంగీక‌రించ‌బోమ‌ని చెబుతున్నారు. కుల సంఘాల్లో రాజ‌కీయాల‌కు తావివ్వ‌డం మంచిది కాద‌ని క‌మ్మ‌వారి పేవా సంఘాల స‌మాఖ్య‌తెలంగాణ వారు చేస్తున్న ప్ర‌చారం ఏమంత స‌మంజ‌సంగా లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రేపు జ‌ర‌గ‌బోయే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మాకు నచ్చిన అభ్య‌ర్థికి మాత్ర‌మే వేస్తామ‌ని కుండ బ‌ద్ధలు కొట్టి చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All