Homeటాప్ స్టోరీస్ఆహా‌లో క‌ంబాల‌ప‌ల్లి క‌థ‌లు చాప్ట‌ర్ 1!

ఆహా‌లో క‌ంబాల‌ప‌ల్లి క‌థ‌లు చాప్ట‌ర్ 1!

ఆహా‌లో క‌ంబాల‌ప‌ల్లి క‌థ‌లు చాప్ట‌ర్ 1!
ఆహా‌లో క‌ంబాల‌ప‌ల్లి క‌థ‌లు చాప్ట‌ర్ 1!

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్.. మై హోమ్ గ్రూప్‌తో క‌లిసి `ఆహా` ఓటీటీని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. మిగ‌తా ఓటీటీల‌కు భిన్న‌గా త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటు కోవ‌డం కోసం విభిన్న‌మైన కాన్సెప్ట్‌ల‌తో టాక్ షోలు, వెబ్ సిరీస్‌లు.. మూవీస్‌ని అందిస్తోంది. ఈ నేప‌థ్యంలో `ఆహా`లో సిరీస్‌లో భాగంగా `కంబాల‌ప‌ల్లి క‌థ‌లు` పేరుతో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వెబ్ డ్రామాని అందిస్తోంది.

`కంబాల‌ప‌ల్లి క‌థ‌లు`లోని చాప్ట‌ర్ 1లో భాగంగా మెయిల్ ని అందిస్తోంది. ఇందులో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈ సిరీస్‌కి సంబంధించిన టీజ‌ర్ బుధ‌వారం విడుద‌లైంది. ఊళ్ల‌ల్లోకి అప్పుడే కంప్యూటర్ ప్ర‌వేశిస్తున్న కాలం అది. 2005 నేప‌థ్యంలో గ్రామాల్లో కంప్యూటర్ అంటే ఏర్ప‌డిన క్రేజ్ నేప‌థ్యంలో ఈ చాప్ట‌ర్ 1ని రూపొందించారు.

- Advertisement -

ప్రియ‌ద‌ర్శి కంబాల‌ప‌ల్లి గ్రామంలో సొంత కంప్యూటర్ కోచింగ్ సెంట‌ర్‌ని న‌డుపుతుంటాడు. కంప్యూటర్ గురించి గ్రామంలో వున్న వారికి శిక్ష‌ణ నిస్తుంటాడు. అయితే ఇందు కోసం త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వారికి మూడు ష‌‌ర‌తులు విధిస్తుంటాడు ద‌ర్శి. ఈ క్ర‌మంలో ఎదుర‌య్యే చిత్ర విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌ల స‌మాహార‌మే ఈ `మెయిల్‌`. ఉదయ్ గుర్రాలా దీనికి దర్శకుడు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై ప్రియాంక ద‌త్, స్వ‌ప్న ద‌త్ ఈ వెబ్ డ్రామాని నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ సంక్రాంతి నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All