
ప్రపంచ మానవాళి మనుగడకు భద్రతకు పెనుసవాల్ గా మారుతున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారత దేశాన్ని తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తమిళ నటుడు కమల్ హాసన్ అభిమానులకు మరియు దేశ ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి మరియు సంక్రమణ అనేది నాలుగు దశలలో ఉంటుందనీ, ప్రస్తుతం మన భారతదేశంలో కరోనా వైరస్ రెండవ దశలో ఉంది అనీ… ఈ దశలో ఎవరైనా విదేశాల నుంచి వచ్చినా.. లేదంటే వైరస్ సోకిన వ్యక్తులతో ప్రత్యక్షంగా కలిసిన ఎడల నుంచి వైరస్ బయటకి సంక్రమించే పరిస్థితి ఉంది అని కమల్ హాసన్ తెలియజేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల అత్యధికంగా భావించబడిన చైనా, ఫ్రాన్స్, ఇటలీ, ఇరాన్ తదితర దేశాలలో మూడు నాలుగు దశలు దాటేసరికి దానికి ప్రజల నిర్లక్ష్యం కూడా తోడవడంతో ఒక్కసారిగా వైరస్ మహమ్మారిలా గా మారి వందలాది మందికి వేలాదిమందికి వ్యాపించి అనేకమంది ప్రాణ నష్టానికి కారణం వివరించారు. ప్రస్తుతానికి కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కానీ చికిత్స విధానం కానీ ఔషధం కాని కనిపెట్టని ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజికంగా దూరం పాటించడం వల్లే ప్రభావాన్ని తగ్గించి ఆయన కరోనా వైరస్ సంక్రమణ ని మరియు వ్యాప్తిని తగ్గించగల మని కమలహాసన్ తెలియజేశారు.
అందరూ రెండు వారాలపాటు ఇంట్లోనే ఉండాలని ముఖ్యమైన అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఎవరు బయట ఎక్కువగా తిరగవద్దు.! అని ఎటువంటి కార్యక్రమాలలో పాల్గొన వద్దని ముఖ్యంగా సామాజికంగా ఎక్కువ మంది హాజరయ్యే సభలు సమావేశాలు వేడుకలు నిర్వహించవద్దని, వ్యక్తిగతంగా కూడా హాజరు కావద్దని కమల్ హాసన్ అభిమానులకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అందరూ ఈ రెండు వారాల పాటు ఇంట్లో ఉండి ఏం చేయాలి.? అని ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో మన జీవితంలో అనేక ప్రశ్నలకు లేదా అనేక పనులకు “మన దగ్గర సమయం లేదు.!” అనే మాట తరుచుగా వాడుతూ ఉంటాము. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీరు వ్యక్తిగతంగా మీకంటూ సమయాన్ని కేటాయించుకోండి.కుటుంబ సభ్యులతో గడపండి. మీరు చేసే వృత్తి పరమైన కార్యక్రమం ఏదైనా అవ్వచ్చు..! ఇంటినుంచి చేయడానికి ప్రయత్నం చేయండి. పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. మీకు ఇష్టమైన మరియు మీరు చదవాలి అనుకొని ఇప్పటివరకు చదవలేక పోయిన పుస్తకాలు చదవండి. సినిమాలు చూడండి. అదేవిధంగా మీరు తెలుసుకోవాల్సిన మీరు తెలుసుకోవాలి అనుకున్న అనేక విషయాల గురించి ఇంటర్నెట్ లో తెలుసుకోండి. అధ్యయనం చేయండి. కొత్త విషయాలు నేర్చుకోండి. ఆన్లైన్ కోర్సులు కూడా నేర్చుకోండి ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండండి.
జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం ఏదైనా ఉంది.. అంటే అది మనతో మన వ్యక్తిగతంగా గడిపే సమయమే. దాని విలువ మనం వెలకట్టలేము. మంచికో చెడుకో ఇప్పుడు అలాంటి సందర్భం మనకు ఎదురైంది మీతో మీరు ఎక్కువగా గడపండి. మీతో మీరు ఎక్కువగా మాట్లాడుకోండి. మిమ్మల్ని మీరు ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోండి. రెండు వారాల పాటు లేదా మూడు వారాల పాటు ప్రశాంతంగా గడపండి. తర్వాత కొత్త జీవితాన్ని, కొత్త ప్రపంచాన్ని చూడటం మొదలుపెడతారు. ప్రపంచం మనకు ఎంత ఘోరమైన పరిస్థితి తీసుకొని వచ్చినా.. మనం అందులో కూడా మంచిని ఆశాభావాన్ని వెతుక్కోవాలి. గ్రహించాలి. ఈ సత్యాన్ని అందరూ మరొకసారి గుర్తు చేసుకోండి అని కమల్ హాసన్ భావోద్వేగంగా మాట్లాడారు.
— Kamal Haasan (@ikamalhaasan) March 21, 2020