
ఇటీవలే పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేసిన కమల్ హాసన్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయాడు. స్వయంగా కోయంబత్తూర్ సౌత్ నుండి పోటీ చేసిన కమల్ హాసన్ బిజెపి అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యాడు. ఎన్నికల తర్వాత కమల్ హాసన్ పార్టీని చాలా మంది వీడిపోయారు. కమల్ కూడా తిరిగి సినిమాల్లో బిజీగా మారాలనుకుంటున్నాడు. దీంతో కమల్ హాసన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.
అయితే దీనిపై కమల్ క్లారిటీ ఇచ్చాడు. తాను పోరాటాన్ని మధ్యలో ఆపే వ్యక్తిని కానని కమల్ హాసన్ అంటున్నాడు. తన చివరి శ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని కమల్ మరోసారి స్పష్టం చేసాడు. సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని, అలాగే రాజకీయాలు కూడా చేస్తానని సెలవిచ్చాడు.
ప్రస్తుతం కమల్ హాసన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇండియన్ 2 షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. అయితే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ షూటింగ్ ను త్వరలోనే మొదలుపెట్టనున్నాడు కమల్.