Homeటాప్ స్టోరీస్`కిన్నెర‌సాని` మూవీ థీమ్ మోష‌న్ పోస్ట‌ర్‌!

`కిన్నెర‌సాని` మూవీ థీమ్ మోష‌న్ పోస్ట‌ర్‌!

Kalyandhev's Kinnerasaani motion poster out
Kalyandhev’s Kinnerasaani motion poster out

మెగా స్టార్ చిన్న‌ల్లుడు కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `కిన్నెర‌సాని` థీమ్ మోష‌న్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం గురువారం విడుద‌ల చేసింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి `అశ్వ‌ద్ధామ‌` ఫేమ్ ర‌మ‌ణ తేజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో ఎస్‌.ఆర్‌.టి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, శుభ‌మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ర‌జ‌నీ తాళ్లూరి, ర‌వి చింత‌ల నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో పాటు ఈ మూవీ గ్లింప్స్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. గురువారం హీరో క‌ల్యాణ్‌దేవ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన థీమ్ మోష‌న్ పోస్ట‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కిన్నెసాని ఎవ‌రు? ఆమె వెన‌కున్న క‌థేంటి? అనే స్థాయిలో ఈ చిత్ర థీమ్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రానికి సాయితేజ్‌, క‌థ‌, క‌థ‌నం అందిస్తున్నారు.

- Advertisement -

డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టించిన `క‌ల్కి` వంటి హిట్ చిత్రానికి సాయితేజ్ క‌థ అందించారు. ఛ‌లో , భీష్మ వంటి హిట్ చిత్రాల‌కు సంగీతం అందించిన మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All