Homeటాప్ స్టోరీస్గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సినిమా

గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సినిమా

గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సినిమా
గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సినిమా

నందమూరి కళ్యాణ్ రామ్ వరస సినిమాలను లైన్లో పెట్టి తన దూకుడుతో అందరికీ షాక్ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఫిక్షనల్ పీరియడ్ డ్రామా బింబిసరలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా బింబిసర న్యూ లుక్ తో పాటు నెక్స్ట్ ప్రాజెక్టులను కూడా అనౌన్స్ చేసారు.

మైత్రి మూవీ మేకర్స్ దర్శకత్వంలో సినిమా చేయనున్న కళ్యాణ్ రామ్, తనతో రెండు సినిమాలను నిర్మించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ కోసం కూడా మరో చిత్రం చేస్తాడు. ఇవి కాకుండా దిల్ రాజు నిర్మాణంలో కూడా కళ్యాణ్ రామ్ సినిమాను ఓకే చేసాడు.

- Advertisement -

తనతో 118 వంటి డీసెంట్ హిట్ ను అందించిన సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కెవి గుహన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేస్తాడు. ఇది పూర్తి స్థాయి క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All