Homeటాప్ స్టోరీస్వెబ్ సిరీస్ లోకి కళ్యాణ్ రామ్

వెబ్ సిరీస్ లోకి కళ్యాణ్ రామ్

Kalyan ram to produce web seriesనందమూరి కళ్యాణ్ రామ్ వెబ్ సిరీస్ లు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు . ఇప్పటికే హీరోగా నిర్మాతగా తన ప్రత్యేకత నిరూపించుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా వెబ్ సిరీస్ లను కూడా నిర్మించాలని డిసైడ్ అయ్యాడట ! ఈ విషయాన్నీ స్వయంగా నందమూరి కళ్యాణ్ రామ్ వెల్లడించడం విశేషం . ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రలో మెప్పించిన కళ్యాణ్ రామ్ తాజాగా 118 అనే విభిన్న కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు .

 

- Advertisement -

ఆ సినిమా మార్చి 1న విడుదల కానున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చాడు కళ్యాణ్ రామ్ . ఇక 118 చిత్రం పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడు కళ్యాణ్ రామ్ . సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో తప్పకుండా హిట్ కొడతానన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు . ఇక బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో బాక్సాఫీస్ అంతా బోసిపోయింది . సక్సెస్ లు లేక కళావిహీనంగా మారింది బాక్సాఫీస్ ,మరి  ఆ లోటు ని కళ్యాణ్ రామ్ భర్తీ చేస్తాడేమో చూడాలి .

English Title: Kalyan ram to produce web series

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All