Homeటాప్ స్టోరీస్క‌ల్యాణ్‌దేవ్ `కిన్నెర‌సాని` ఫ‌స్ట్ గ్లింప్స్‌ ఇంప్రెసివ్‌గా వుందిగా!

క‌ల్యాణ్‌దేవ్ `కిన్నెర‌సాని` ఫ‌స్ట్ గ్లింప్స్‌ ఇంప్రెసివ్‌గా వుందిగా!

క‌ల్యాణ్‌దేవ్ `కిన్నెర‌సాని` ఫ‌స్ట్ గ్లింప్స్‌ ఇంప్రెసివ్‌గా వుందిగా!
క‌ల్యాణ్‌దేవ్ `కిన్నెర‌సాని` ఫ‌స్ట్ గ్లింప్స్‌ ఇంప్రెసివ్‌గా వుందిగా!

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్‌దేవ్ హీరోగా నిల‌బ‌డాల‌ని ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆయ‌న నుంచి వ‌స్తున్న తాజా చిత్రం `కిన్నెర‌సాని`. `అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌య‌త్‌` అని ఉప‌శీర్షిక‌. నాగ‌శౌర్య‌తో `అశ్వద్ధామ‌` చిత్రాన్ని తెర‌కెక్కించిన ర‌మ‌ణ తేజ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. సాయి రిషిక స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఆర్‌.టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, శుభ‌మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై రామ్ తాళ్లూరి, ర‌వి చింత‌ల‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

`క‌ల్కి` చిత్రానికి క‌థ అందించిన దేశ‌రాజ్ సాయితేజ్ ఈ చిత్రానికి క‌థ‌, క‌థ‌నం అందిస్తున్నారు. కంటెంట్‌కి ప్రాధాన్య‌త నిస్తూ నిర్మిస్తున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ నుంచి ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ గ్లింప్స్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. క‌ల్యాణ్‌దేవ్ ఏకాంతంగా ప‌డుకుని వున్న విజువ‌ల్‌లో టీజ‌ర్ మొద‌లైంది.

- Advertisement -

పండు టాకులు రాలుతుండ‌గా..సూరీడుకే క‌నిపించ‌నీ.. నా గుండెలో చితిమంట‌నీ… ఏ మేఘ‌మో అడ‌గాల‌నీ.. ఆశించినా క‌థ నాద‌నీ… అంటూ ఓ యువ‌తి వాయిస్ ఆక‌ట్టుకుంటోంది. ఫ‌స్ట్ గ్లింప్స్‌కి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ అందించిన బీజీఎమ్స్ సినిమా మూడ్‌ని తెలియ‌జేస్తున్నాయి. క‌న్నెర‌సాని చెబుతున్న క‌థేంటి?.. ఆమె వెన‌కున్న వ్య‌ధ ఏంట‌న్న‌ది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఫ‌స్ట్ గ్లింప్స్ విజువ‌ల్స్ ప‌రంగా.. నేప‌థ్య సంగీతం ప‌రంగా.. ఇంప్రెసివ్‌గా వుంద‌నే టాక్ మొద‌లైంది. ఈ మూవీతో క‌ల్యాణ్‌దేవ్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకునేలా వున్నాడుగా..

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All