Homeటాప్ స్టోరీస్మెగా అల్లుడి కొత్త మూవీ టైటిల్ `కిన్నెర‌సాని`

మెగా అల్లుడి కొత్త మూవీ టైటిల్ `కిన్నెర‌సాని`

మెగా అల్లుడి కొత్త మూవీ టైటిల్ `కిన్నెర‌సాని`
మెగా అల్లుడి కొత్త మూవీ టైటిల్ `కిన్నెర‌సాని`

మెగాస్టార్ అల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం ఇటీవ‌లే లాంఛ‌నంగా మొద‌లైన విష‌యం తెలిసిందే. ఎస్ ఆర్ టి ఎన్‌ట‌ర్‌టైన్‌మెంట్స్‌, శుభం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో ర‌జ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ‌శౌర్య‌తో `అశ్వ‌ద్ధామ‌` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచయ‌మైన ర‌మ‌ణ తేజ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ మూవీకి `కిన్నెర‌సాని` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. శ‌నివారం దీపావ‌ళి సంద‌ర్భంగా టైటిల్ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్‌కు అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌య‌త్ (హ‌ద్దు లేక‌పోవ‌డం ప్ర‌మాదం) అనే క్యాప్ష‌న్‌ని పెట్టారు. అహ్ల‌ద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం..స‌ముద్ర‌పు అల‌లు.. ఆ ప‌క్క‌నే బండ‌రాళ్ల మ‌ధ్య టైటిల్ ని బ‌ల‌మైన గొలుసుల‌తో బంధించి వున్న‌ట్టుగా చూపిస్తున్న తీరు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

- Advertisement -

డా. రాజ‌శేఖ‌ర్ న‌టించిన `క‌ల్కి` చిత్రానికి క‌థ అందించిన సాయితేజ ఈ చిత్రానికి క‌థ అందించారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. విజేత‌, సూప‌ర్ మ‌చ్చి చిత్రాల త‌రువాత కళ్యాణ్‌దేవ్ న‌టిస్తున్న మూడ‌వ చిత్ర‌మిది. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా మేకింగ్ ప‌రంగా మ‌రింత కొత్త‌గా వుండేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All