Homeటాప్ స్టోరీస్త్వరలో “ప్రజాకవి కాళోజీ” బయోపిక్

త్వరలో “ప్రజాకవి కాళోజీ” బయోపిక్

త్వరలో “ప్రజాకవి కాళోజీ” బయోపిక్
త్వరలో “ప్రజాకవి కాళోజీ” బయోపిక్

తొలగి తోవెవడిచ్చు త్రోసుకొని పోవలయు, బ్రతుకు పోరాటము పడకు ఆరాటము. ఒక మనిషిని కదిలించే శక్తి అక్షరానికి ఉంటుంది.అదేవిధంగా ఒక తరాన్ని కదిలించే శక్తి ఒక రచయితకు మాత్రమే ఉంటుంది. అలా కొన్ని తరాలను చైతన్యవంతం చేసిన ప్రజాకవి, పద్మవిభూషణ్, స్వర్గీయ కాళోజీ గారి బయోపిక్ వెండితెరపై త్వరలో వస్తోంది. స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి బయోపిక్ శ్రీమతి విజయలక్ష్మి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి గారి చేతుల మీదుగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇక ఈ సినిమాను జై నీ ప్రభాకర్ గారు తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు “ప్రజాకవి కాళోజీ” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

స్వర్గీయ కాలేజీ గారి పాత్రలో శ్రీ మూలవిరాట్ అదేవిధంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి పాత్ర ఆయన తమ్ముడు మనోహర్ రావు గారు పోషిస్తున్నారు. కాళోజీ గారి భార్యగా విజయలక్ష్మి గాయని కనిపిస్తారు ఈ సినిమాకు ఎస్.ఎస్ ఆత్రేయ సంగీత దర్శకుడు. ఈ సినిమా కాళోజీ ఫౌండేషన్ సభ్యులు ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్, నాగిళ్ల రామశాస్త్రి, వి .ఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు మరియు కవి అన్వర్ పర్యవేక్షణలో రూపుదిద్దుకొంది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ఎప్పుడు వెండితెరపై వస్తూనే ఉంటాయి. కానీ గొప్ప సినిమాలు మాత్రం చాలా అరుదుగా వస్తాయి. అలాంటి గొప్ప సినిమాల్లో ఒకానొక సినిమా ప్రజాకవి కాళోజీ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All