Homeటాప్ స్టోరీస్కల్కి 2 కూడా ప్లాన్ చేస్తున్నారట

కల్కి 2 కూడా ప్లాన్ చేస్తున్నారట

Kalki
Kalki

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి . ఈనెల 28 విడుదల అవుతున్న చిత్రానికి పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది . ఇక రాజశేఖర్ కూడా తప్పకుండా హిట్ కొడతానన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు . 1983 నాటి కథతో తెరకెక్కిన చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడంతో కల్కి 2 కూడా చేయాలనే ఆలోచన చేస్తున్నాడట దర్శకుడు ప్రశాంత్ వర్మ

ఇప్పటికే గరుడ వేగ 2 కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు . కల్కి విడుదల అయ్యాక గరుడ వేగ 2 సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు . ఇక కల్కి హిట్ అయితే దానికి సీక్వెల్ గా కల్కి 2 కూడా చేయాలని డిసైడ్ అయ్యారట . అంటే మరో రెండు రోజుల్లోనే కల్కి రిజల్ట్ ఏంటో తెలిసిపోతుంది కాబట్టి దాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నారు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All