Homeటాప్ స్టోరీస్100 మిలియన్ వ్యూస్ సాధించిన సర్కారు 'కళావతి సాంగ్'

100 మిలియన్ వ్యూస్ సాధించిన సర్కారు ‘కళావతి సాంగ్’

Kalaavathi Emerges The Fastest First Single To Reach 100 Million Milestone In TFI
Kalaavathi Emerges The Fastest First Single To Reach 100 Million Milestone In TFI

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోస్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక కళావతి సాంగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే..ఈ పాట విడుదలైనప్పటి నుండి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకపోతునే ఉంది. తాజాగా 100 మిలియన్ల వ్యూస్ సాధించి వార్తల్లో నిలిచింది.

వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు మహేష్ కూతురు సితార , కీర్తి సురేష్ లు స్టెప్స్ వేస్తూ ఆ వీడియో లు సోషల్ మీడియా లో షేర్ చేసారు. ఇక ఈ మూవీ సమ్మర్ కానుకగా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబుని పరశురామ్ తనదైన శైలిలో కంపర్ట్  జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడని తెలుస్తుంది. సినిమాలో కమర్శియల్ అంశాలు పుష్కలంగా జొప్పించినట్లు కళావతి పాత్రను..మహేష్ క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేశారని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ల్లో ఉంది. మహేష్  డబ్బింగ్ పనులు పూర్తిచేసి కొత్త సినిమా షూట్ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All