
అతి త్వరలో ఓ బేబీ కి జన్మనివ్వబోతున్నప్పటికీ కాజల్ మాత్రం వరుస ఫోటో షూట్స్ తో ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది. ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో పాటు మెటర్నిటి ఫొటో షూట్స్ చేస్తూ ఫాలోయర్స్ ను అలరిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. లక్ష్మి కళ్యాణం మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కాజల్..మగధీర మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకుంది.ఆ తర్వాత వరుస అగ్ర హీరోలతో పాటు సీనియర్ హీరోల పక్కన జోడి కట్టి అతి తక్కువ టైంలోనే అగ్ర హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
కెరియర్ జెట్ స్పీడ్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలు చేసింది. కానీ, ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున ‘ఘోస్ట్’, తమిళ చిత్రం ‘రౌడీ బేబీ’ నుంచి కూడా బయటకు వచ్చేసింది. ఇక సినిమాల్లో ఉన్నప్పుడే కాదు ప్రస్తుతం తల్లికాబోతున్నప్పటికీ సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది. తాజాగా ఓ కొత్త ఫోటో ఒకటి షేర్ చేసింది. బేబి బంప్ లుక్ లోనూ రెండు చేతులు పైకెత్తి కాజల్ స్టైలిష్ గా కెమెరాకు ఫోజులిచ్చింది.
శరీరానికి బాగా సౌకర్యంగా ఉండే బ్లాక్ డ్రెస్ ను ధరించి బేబిని ఆకాస్ట్యూమ్స్ లో దాచేసే ప్రయత్నం కనిపిస్తుంది. హెయిర్ ని సైతం ఎంతో స్టైలిష్ గా కెమెరా యాంగిల్ కోసం ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కాజల్ అభిమానులు సో బ్యూటీఫుల్..అంటూ కామెంట్స్ వేస్తున్నారు.