
చిరకాల మిత్రుడు, ప్రియుడు గౌతమ్ కిచ్లూని స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లి తరువాత వెంటనే మాల్దీవులకు హనీమూన్‌కి వెళ్లిన కాజల్ సోషల్ మీడియాలో హానీ మూన్ ఫొటోలతో సండి చేసింది. భర్త కిచ్లూతో కలిసి మాల్దీవుల్లో రోజూ సందడి చేస్తూ ఆ ఫొటోలని అభిమానులతో పంచుకుంటూ హల్చల్ చేసింది. చివరికి ఫస్ట్ నైట్ మల్లెపూలని సింబాలిక్‌గా చూపించి ఓ రేంజ్లో వైరల్ అయ్యింది.
తాజాగా హనీమూన్ ముగించుకుని ముంబై చేరిన కాజల్ తను అంగీకరించిన సినిమాలపై దృష్టి పెట్టింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి `ఆచార్య` చిత్రంలో నటిస్తున్న కాజల్ దర్శకుడు కొరటాల పిలుపు కోసం ఎదురుచూస్తోంది. ఇదిలా వుంటే కాజల్ తన భర్త బిజినెస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారబోతోందట. గౌతమ్ కిచ్లూ ఓ బిజినెస్మెన్. ఇంటీరియన్ రంగంలో వున్నారు.
`డిస్కెర్న్ లివింగ్` అనే ఇంటీరియర్ కంపనీని కిచ్లూ నడుపుతున్నారు. ఈ సంస్థ ప్రచార కర్తగా కాజల్ బాధ్యతలు స్వీకరించబోతోందట. ఇదే విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవలే ఈ సంస్థ ప్రచారం కోసం ఓ యాడ్ ఫిల్మ్ లో నటించిన కాజల్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడించనుందని తెలిసింది.