Homeటాప్ స్టోరీస్కాజల్ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా

కాజల్ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా

కాజల్ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా
కాజల్ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా

కాజల్ అగర్వాల్ దశాబ్దన్నర కాలంగా టాలీవుడ్ లో అగ్ర స్థానాన కొనసాగుతున్న హీరోయిన్. అయితే అవకాశాలు తగ్గాయన్న ప్రతీసారి ఆమె బౌన్స్ బ్యాక్ అవుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మధ్య కూడా కాజల్ కు అవకాశాలు తగ్గినట్లే అనిపించింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ వచ్చిన కాజల్ రీసెంట్ గా అల్లరి నరేష్ సినిమాలో నటిస్తోందంటే ఆమె రేంజ్ పడిపోయిందనే అనుకున్నారు అందరూ. ఇక ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగడం కష్టమనే భావించారు. అయితే కాజల్ మాత్రం ఎప్పటిలానే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది.

ప్రస్తుతం కాజల్ చేతిలో మూడు భారీ చిత్రాలు ఉన్నాయి. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ అన్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే దురద్రష్టవశాత్తూ ప్రమాదం జరగడం, తర్వాత కరోనా వైరస్ తో షూటింగ్ కు బ్రేక్ పడింది.

- Advertisement -

ఇది కాకుండా రీసెంట్ గా కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ముందు త్రిషను అనుకున్నా కానీ ఆమె కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకోవడంతో వెంటనే కాజల్ ను సంప్రదించి ఆమెను ఓకే చేసుకున్నారు. ఇది కాకుండా మంచు విష్ణుతో మోసగాళ్లు అనే సినిమా చేస్తోంది.

ఇప్పుడు కోలీవుడ్ లో కాజల్ మరో భారీ అవకాశాన్ని పట్టినట్లు సమాచారం. మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో ఒక చిత్రం రూపొందుతుందని ఇప్పటికే ఖరారైంది. తుపాకీ చిత్రానికి ఇది సీక్వెల్ అంటున్నారు. ప్రస్తుతం మురుగదాస్ అంత ఫామ్ లో లేని కారణంగా ఈసారి పక్కా స్క్రిప్ట్ తో వచ్చి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. తుపాకీ సీక్వెల్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ పాత్రను సీక్వెల్ లో ఉంచాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా కాజల్ మళ్ళీ బిజీ స్టార్ అయిపోయింది. మరో రెండు, మూడేళ్లు ఈజీగా బండి లాగించేయొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All