Homeటాప్ స్టోరీస్ఉమా, లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ తో కాజల్!

ఉమా, లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ తో కాజల్!

ఉమా, లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ తో కాజల్!
ఉమా, లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ తో కాజల్!

పెళ్లి అయితే నటీమణుల కెరీర్ కు బ్రేక్ పడుతుంది. కానీ కాజల్ అగర్వాల్ విషయంలో అది రివర్స్ లో జరుగుతోంది. ఆమె వరసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. కొన్ని నెలల క్రితం ఆమె నటించిన వెబ్ సిరీస్ విడుదలైన విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఆమె బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ ను చేయనుంది.

ఈ విషయాన్ని కాజల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఉమా జర్నీ మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని కాజల్ పోస్ట్ చేసింది. మిరాజ్ గ్రూప్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తథాగత సింఘా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఉమా చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

కాజల్ అగర్వాల్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య చిత్రంలో నటిస్తోంది. అలాగే ఇండియన్ 2 పూర్తి చేయాల్సి ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున చేయబోతున్న యాక్షన్ థ్రిల్లర్ లో కాజల్ కథానాయికగా ఎంపికైంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All