
అందాల చందమామ కాజల్ అగర్వాల్‌కు తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేక గుర్తింపు, క్రేజ్ వున్న విషయం తెలిసిందే. పుష్కర కాలం కావస్తున్నా ఇంకా కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అదే జోరు.. అదే జోష్ ఆమెలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాజల్ `ఆచార్య` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.
కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ గత ఏడు నెలలుగా ఆగిపోయింది. కమల్ హాసన్‌తో నటిస్తున్న `ఇండియన్ 2` షూటింగ్ ని కూడా ఇదే తరహాలో ఆపేశారు. ఇవి ఎప్పుడెప్పుడు మళ్లీ మొదలవుతాయా అని కాజల్ ఎదురుచూస్తోంది. ఇదిలా వుంటే నాజూగ్గా తయారైన కాజల్ ఫొటోలు ప్రస్తుతం ఇన్ స్టా లో సందడి చేస్తున్నాయి.
బ్లాక్ డ్రెస్‌లో టైట్ ఫిట్ లో థై షో చేస్తున్న కాజల్ పిక్స్ ఇంటర్నెట్‌ని హీటెక్కిస్తున్నాయి. ఓ పార్టీలో పాల్గొన్న కాజల్ బ్లాక్ డ్రెస్‌లో థై షో చేస్తూ చేతిలోవైన్ బాడిల్ పట్టుకుని పోజులిచ్చిన ఫొటోలు ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి. కాజల్ నటిస్తున్న `మోసగాళ్లు` ఇప్పటికే ప్రారంభం కాగా మెగాస్టార్ చిరు నటిస్తున్న `ఆచార్య`, కమల్‌హాసన్ – శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న `ఇండియన్ 2` వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రానున్నాయి.