Homeగాసిప్స్క‌రోనా వున్నా డోంట్ కేర్ అంటోంది!

క‌రోనా వున్నా డోంట్ కేర్ అంటోంది!

క‌రోనా వున్నా డోంట్ కేర్ అంటోంది!
క‌రోనా వున్నా డోంట్ కేర్ అంటోంది!

సినిమా షూటింగ్‌లు లేక రెండున్న‌ర నెల‌లు అవుతోంది. సినీ కార్మికులు ప‌నిలేక అల్లాడుతున్నారు. ఇప్ప‌టికైనా అనుమ‌తులివ్వండి అంటూ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన స్టార్ హీరోలు తీరా అనుమ‌తులిచ్చాక బ‌య‌టికి రావ‌డానికి జంకుతున్నారు. క‌రోనా విళ‌య‌తాండ‌వం చేస్తుంటే సెట్లోకి రావ‌డానికి స్టార్ హీరోలు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. షూటింగ్‌లు వాయిదా వేస్తున్నారు. ‌

ఇదిలా వుంటే స్టార్ నాయిక‌, అందాల చంద‌మామ మాత్రం క‌రోనా వున్నా స‌రే డోంట్ కేర్ అంటూ షూటింగ్ కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌ధానంగా క‌రోనా ప్ర‌మాద స్థాయిలో పెరిగిపోతున్న ముంబైలో షూటింగ్ చేయ‌డానికి కాజ‌ల్ ముందుకు రావ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. త‌న స‌హ‌చ‌ర హీరోయిన్‌లు షూటింగ్ చేయ‌డానికి మొరాయిస్తుంటే కాజ‌ల్ మాత్రం క‌మ‌ర్ష‌య‌ల్ యాడ్ కోసం ముందుకు రావ‌డం విశేషంగా చెబుతున్నారు.

- Advertisement -

కొన్ని రోజుల క్రితం కాజ‌ల్ ఓ క‌మ‌ర్షి‌య‌ల్ యాడ్ ఫిల్మ్ కోసం అగ్రిమెంట్ చేసుకుంది. త‌ను చేసుకున్న అగ్రిమెంట్ ప్ర‌కారం క‌మ‌ర్షి‌య‌ల్ యాడ్ షూట్‌లో పాల్గొని త‌న క‌మిట్‌మెంట్ ని మ‌రోసారి నిరూపించింది. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం జాగ్ర‌త్త‌లు తీసుకున్న త‌రువాతే కాజ‌ల్ షూటింగ్‌లో పాల్గొంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All