Homeటాప్ స్టోరీస్కాశి రివ్యూ

కాశి రివ్యూ

Kaasi Review
Kaasi Review

నటీనటులు : విజయ్ ఆంటోనీ , అంజలి , జయప్రకాశ్
సంగీతం : విజయ్ ఆంటోనీ
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోనీ
దర్శకత్వం : క్రుతిగ ఉదయనిధి
రేటింగ్ : 2. 5/ 5
రిలీజ్ డేట్ : 18 మే 2018

 

- Advertisement -

బిచ్చగాడు చిత్రంతో సంచలన విజయం అందుకున్న విజయ్ ఆంటోనీ కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడటంతో వరుసగా విజయ్ ఆంటోనీ చిత్రాలు తెలుగులో విడుదల అవుతున్నాయి . ఆ కోవలోనే తాజాగా ” కాశి ” అనే చిత్రం ఈరోజు తెలుగునాట విడుదల అయ్యింది . మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్ళాల్సిందే .

కథ :

అమెరికాలో పెద్ద పేరున్న డాక్టర్ భరత్ ( విజయ్ ఆంటోనీ )కి తరచుగా ఓ కల వస్తుంటుంది , ఆ కలలో తనని ఓపెద్ద పాము , ఎద్దు చంపడానికి వస్తున్నట్లు గా ఉండటంతో ఆ కల ని తన తల్లిదండ్రులకు చెబుతాడు . దాంతో భరత్ కు అసలు విషయం చెబుతారు , నువ్వు మా కన్నబిడ్డ వి కాదని దత్తత తీసుకొచ్చామని చెప్పడంతో తన తల్లిదండ్రులెవరో తెలుసుకోవడానికి ఇండియాకు బయలుదేరుతాడు . అయితే విజయవాడ లోని అనాధ శరణాలయం ని సంప్రదించిన తర్వాత కంచర్ల పాలెం లో తనకు సంబందించిన వాళ్ళు ఉన్నారని అక్కడుకు వెళ్తాడు . కంచర్ల పాలెం వెళ్ళిన భరత్ కాశి ఎలా అయ్యాడు ? తన తల్లిదండ్రుల ఆచూకి కనుక్కున్నడా ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

విజయ్ ఆంటోనీ

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే
సంగీతం
డైరెక్షన్

నటీనటుల ప్రతిభ :

డాక్టర్ భరత్ గా , తల్లిదండ్రుల కోసం తపన పడే కాశి గా రకరకాల గెటప్ లలో విజయ్ ఆంటోనీ బాగా నటించాడు . అయితే అవి కథ ని మరింతగా రసవత్తరంగా సాగించాల్సింది పోయి నసగా విసిగిస్తాయి . అంజలి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు . జయప్రకాశ్ తో పాటు మిగతా నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

తల్లిదండ్రులను కనుక్కోవాలనే సెంటిమెంట్ తో ప్రారంభం లో బాగానే నడిపించాడు దర్శకుడు కానీ సీన్ మారుతున్న కొద్దీ ఏమాత్రం ఆకట్టుకోలేని అతుకుల బొంత లాంటి సన్నివేశాలతో పాత్రలతో విసిగించేస్తాడు . దర్శకుడిగా ఒక్క సీన్ లో కూడా మెప్పించలేక పోయాడు కృతిగ ఉదయనిది . ఛాయాగ్రహణం బాగుంది అయితే సంగీతం మైనస్ అనే చెప్పాలి , సరైన పాటలు లేకుండా పోయాయి . నిర్మాణ విలువలు ఫరవాలేదు .

ఓవరాల్ గా :

కాశి ఏమాత్రం ఆకట్టుకునే సినిమా కాదు

                    Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All