Homeటాప్ స్టోరీస్కాలా రివ్యూ

కాలా రివ్యూ

kaala reviewనటీనటులు : రజనీకాంత్ , ఈశ్వరి రావు , హుమా ఖురేషి
సంగీతం : సంతోష్ నారాయణ్
నిర్మాత : ధనుష్
దర్శకత్వం : పా . రంజిత్
రేటింగ్ : 2. 5 / 5
రిలీజ్ డేట్ : 7 జూన్ 2018

సూపర్ స్టార్ రజనీకాంత్ – పా రంజిత్ ల కాంబినేషన్ లో కబాలి వంటి ప్లాప్ చిత్రం వచ్చినప్పటికీ రంజిత్ పై ఉన్న నమ్మకంతో మరోసారి ఛాన్స్ ఇచ్చాడు రజనీకాంత్ . పైగా ముంబై స్లమ్ ఏరియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి . మొదటి సారి మిస్ ఫైర్ అయినప్పటికీ రెండోసారైనా హిట్ కొట్టేలా ఈ కాంబినేషన్ వర్కౌట్ చేసిందా ? లేదా ? తెలియాలంటే సినిమా కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

కరికాలన్ అలియాస్ కాలా ( రజనీకాంత్ ) ముంబై లోని స్లమ్ ఏరియా అయిన ధారావి ప్రజలకు అండగా ఉంటాడు . అయితే ముంబై నడిబొడ్డున ఆ స్లమ్ ఏరియా ఉండటంతో దాన్ని హస్తగతం చేసుకొని అపార్ట్ మెంట్లు నిర్మించాలని భావిస్తాడు అధికార పార్టీకి చెందిన హరిదాదా ( నానా పటేకర్ ). అయితే అతడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతుంటాడు కాలా . తనకి అడ్డుగా ఉన్న కాలా ని హరి దాదా చంపించాలని ప్లాన్ వేస్తాడు . అయితే ఆ హత్యాయత్నం నుండి కాలా తప్పించుకుంటాడు . ధారావి లో కట్టాలనుకున్న అపార్ట్ మెంట్ లను హరి దాదా కట్టాడా ? కాలా ఏం చేసాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

రజనీకాంత్
ఎంచుకున్న కథ
నిర్మాణ విలువలు

డ్రా బ్యాక్స్ :

సంగీతం
స్లో నెరేషన్
డైరెక్షన్

నటీనటుల ప్రతిభ :

రజనీకాంత్ అంటేనే స్టైల్ , దాంతో మరోసారి ఈ చిత్రంలో కూడా స్టయిల్ తో అలరించాడు . రజనీ గెటప్ కూడా బాగుంది అలాగే తనదైన శైలిలో నటించి భేష్ అనిపించాడు . అయితే రజనీ నుండి కోరుకునే యాక్షన్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ లేకపోవడం పెద్ద మైనస్ . ఇక విలన్ పాత్రలో బాలీవుడ్ దిగ్గజం నానా పటేకర్ నటించాడు . హరి దాదా పాత్రలో నానా పటేకర్ నటన అద్భుతమనే చెప్పాలి . ఈశ్వరి రావు రజనీ భార్యగా నటించింది , సినిమాలో ఈశ్వరి రావు పాత్రే కొంత రిలీఫ్ కాస్త నవ్వించడానికి ప్రయత్నించింది . హుమా ఖురేషి అందాల భామ అయితే పాపం ఆ అందాల భామని మరో కోణంలో చూపించారు .

 

సాంకేతిక వర్గం :

సంతోష్ నారాయణ్ అందించిన పాటల్లో అంతగా ఆకట్టుకునే పాటలు లేవు అలాగే రీ రీ రికార్డింగ్ కూడా అంతగా ఆకట్టుకోలేదు . ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . ముంబై లోని ధారావి ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు . ఇక ధనుష్ నిర్మాణం గురించి ఎంత చెప్పినా తక్కువే ! ముంబై స్లమ్ ఏరియా సెట్ ని వేసి నిర్మాణ దక్షత నిరూపించుకున్నాడు . అయితే దర్శకుడు పా . రంజిత్ విషయానికి వస్తే ….. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చిన సూపర్ అవకాశాన్ని మరోసారి దుర్వినియోగం చేసుకున్నాడు . ఈ కథలో హీరోయిజం ని ఎలివేట్ చేసే సీన్స్ రాసుకోవచ్చు కానీ ఆ ప్రయత్నం మాత్రం చేయలేదు . సహజత్వం అనే కోణం ని ఈ సినిమాలో కూడా చూపించి రజనీ ఫ్యాన్స్ ఆశలను వమ్ము చేసాడు .

ఓవరాల్ గా :

కాలా …… రజనీకాంత్ కోసం ఒక్కసారి చూడొచ్చు …..

            Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All
సూపర్ స్టార్ రజనీకాంత్ - పా రంజిత్ ల కాంబినేషన్ లో కబాలి వంటి ప్లాప్ చిత్రం వచ్చినప్పటికీ రంజిత్ పై ఉన్న నమ్మకంతో మరోసారి ఛాన్స్ ఇచ్చాడు రజనీకాంత్ . పైగా ముంబై స్లమ్ ఏరియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి . మొదటి సారి మిస్ ఫైర్ అయినప్పటికీ రెండోసారైనా హిట్ కొట్టేలా ఈ కాంబినేషన్ వర్కౌట్ చేసిందా ? లేదా ? తెలియాలంటే సినిమా కథ లోకి వెళ్లాల్సిందే .కాలా రివ్యూ