
ఆర్ఆర్ఆర్ సినిమా గురించి యావత్ ప్రపంచం మాట్లాడుతుంది..తెలుగు సినిమా సత్తా ఇది అని అంత కొనియాడుతుంటే..క్రైస్తవ మత ప్రచారకుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ మాత్రం ఆర్ఆర్ఆర్ అనేది సినిమానా..అదెక్కడ మూవీ అయ్యా బాబు? రోజుకో మూవీ వస్తున్నట్లు ఉంది అని కామెంట్ చేయడం అభిమానులకు బాగా కాలింది. అక్కడితో ఆగకుండా పాల్..సినిమాలు చూడడం టైం వేస్ట్ అని మార్పు కోసం ఆలోచించాలి అని అనడం తో సినీ ప్రేమికులకు కాదు చిత్రసీమలో పలువురుకు బాగా కాలింది.
ఎవరు ఏమనుకున్నా లెక్క చేయని వర్మ..పాల్ కామెంట్స్ కు సింపుల్ గా ‘నీ మొహం రా’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచాడు. గతంలోనే చాలాసార్లు కే ఏ పాల్ కు సంబంధించిన స్టేట్మెంట్స్ పై సెటైర్లు కూడా వేయడం జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి RRR మూవీ తనకు తెలియదు అన్నట్లుగా స్పందించడంతో వర్మ ఈ విధంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి వర్మ కౌంటర్ కు పాల్ ఇంకేమైనా కౌంటర్ ఇస్తాడేమో చూడాలి. ఇక వర్మ ప్రస్తుతం మీ ఇష్టం మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.