Homeటాప్ స్టోరీస్ఆ హీరో గంజాయి తీసుకునేవాడట

ఆ హీరో గంజాయి తీసుకునేవాడట

K.-Bhagyaraj-Smoked-Ganja-when-he-was-young
K.-Bhagyaraj-Smoked-Ganja-when-he-was-young

ఆ హీరో గంజాయి తీసుకునేవాడట నేను గంజాయి తీసుకునే వాడినని , దానికి బానిస అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరో కమ్ దర్శకుడు కే. భాగ్యరాజ్. తమిళంలో భాగ్యరాజ్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి అలాగే రీమేక్ కూడా అయ్యాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ నటుడు సుపరిచితుడే! 80 వ దశకంలో హీరోగా దర్శకుడిగా సంచలన విజయాలు అందుకున్నాడు భాగ్యరాజ్.

అయితే అదే సమయంలో షూటింగ్ ల నిమిత్తం తరచుగా కోయంబత్తూర్ వెళ్తుండటంతో అక్కడ ఇతడికి గంజాయి అలవాటు చేశారట కొంతమంది.

- Advertisement -

మొదట్లో అది ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి గంజాయి తీసుకున్నాడట కానీ అది మెల్లి మెల్లిగా అలవాటు అయి అది తాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చానని అప్పుడు కానీ నాకు నేను చేస్తున్న తప్పులు ఏంటో తెలిసొచ్చాయని అందుకే మెల్లి మెల్లిగా గంజాయికి దూరమయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసాడు భాగ్యరాజ్. గంజాయి అలవాటు చేసుకోవడం మంచిది కాదని , దాని వల్ల కెరీర్ మాత్రమే కాదు మనిషిగా పతనం అవుతామని అంటున్నాడు. ఇంతకీ భాగ్యరాజ్ సినిమాల్లోకి రాకముందు ఎందులో పనిచేసాడో తెలుసా …. పోలీస్ శాఖలో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All