
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ రామ్ పుట్టినరోజు ఈరోజు దాంతో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన కొడుక్కి మొదటి పుట్టినరోజు ని భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ . లక్ష్మి ప్రణతి – జూనియర్ ఎన్టీఆర్ లకు ఇద్దరు కొడుకులు అన్న సంగతి తెలిసిందే . పేద కొడుకు నాన్నకు ప్రేమతో చిత్రం అప్పుడు పుట్టగా అతడికి అభయ్ రామ్ అనే పేరు పెట్టాడు .
ఇక రెండో కొడుకు గత ఏడాది పుట్టాడు , అతడికి భార్గవ రామ్ అనే పేరు పెట్టాడు . ఈరోజు చిన్న కొడుకు భార్గవ రామ్ మొదటి పుట్టినరోజు కావడంతో సన్నిహితుల, కుటుంబ సభ్యల సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసాడు ఎన్టీఆర్ . జూనియర్ కు ఇద్దరు కొడుకులు కావడంతో చాలా సంతోషంగా ఉంటున్నాడు వాళ్లతో ఆడుకుంటూ .
- Advertisement -
- Advertisement -