Homeటాప్ స్టోరీస్తెలంగాణ తెలుగుదేశం పగ్గాలు ఎన్టీఆర్ చేతికి

తెలంగాణ తెలుగుదేశం పగ్గాలు ఎన్టీఆర్ చేతికి

Jr. ntr will comes politics in 2023తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిన విషయం తెలిసిందే . 2004 వరకు తెలుగుదేశం పార్టీ ఓ వెలుగు వెలిగింది అయితే 2014వరకు కూడా కాస్త ఫరవాలేదు అనిపించింది . 2014 లో 15 అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలిచి సత్తా చాటింది అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ చావుదెబ్బ తింది . 119 స్థానాల్లో మిత్రులతో కలిసి పోటీ చేస్తే దక్కింది కేవలం 2 అసెంబ్లీ స్థానాలు మాత్రమే !

 

- Advertisement -

ఆ రెండు కూడా ఖమ్మం జిల్లాలో మాత్రమే ! అయితే సండ్ర వెంకట వీరయ్య తాజాగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడు దాంతో తెలంగాణలో తెలుగుదేశం పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి రావడం ఖాయమని అంటున్నారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలని లేదు దాంతో మరో రెండు మూడేళ్ళ తర్వాత లేదంటే తెలంగాణలో ఎన్నికలు సమీపించే కొద్దీ నెలల ముందు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయమని తెలుస్తోంది . తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పట్లో బతకడం కష్టమే కానీ జూనియర్ ఎన్టీఆర్ వస్తే రాజకీయాల్లో మార్పులు రావడం ఖాయం . తెలంగాణలో మళ్ళీ 2023 లో అసెంబ్లీ  ఎన్నికలు జరుగనున్నాయి . కాబట్టి 2023 లో ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేస్తాడేమో చూడాలి .

English Title: Jr. ntr will comes politics in 2023

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All