Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ప్రచారానికి రాడా ?

ఎన్టీఆర్ ప్రచారానికి రాడా ?

jr ntr will come to campaignయంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అక్క సుహాసిని కోసం కూకట్ పల్లి లో ప్రచారం చేస్తాడని అనుకున్నారు , డేట్స్ కూడా చెప్పేసారు కానీ ఇప్పుడేమో ఎన్టీఆర్ ప్రచారానికి రాలేదు . మరో నాలుగు రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది ఆ తర్వాత ఎన్నికలే ! అయినా ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు రాలేదు దాంతో చంద్రబాబు పై ఎన్టీఆర్ కోపంగా ఉన్నాడన్న విషయం రూడీ అయ్యింది . తెలంగాణలో ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో కూకట్ పల్లి నుండి ఎన్టీఆర్ ప్రచారం చేయాల్సింది పోయి మీనమేషాలు లెక్కిస్తున్నాడు .

కూకట్ పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుహాసిని కూడా తన తరుపున ప్రచారం చేయడానికి నా సోదరులు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు వస్తారని చెప్పింది . కానీ ఇంతవరకు ఎన్టీఆర్ ప్రచారానికి రాలేదు అలాగే కళ్యాణ్ రామ్ కూడా రాలేదు . ఇక మిగిలింది నాలుగు రోజులే కాబట్టి చివరి రోజు వస్తారేమో అని అనుకుంటున్నారు . ఎన్టీఆర్ రాకపోతే తప్పకుండా చంద్రబాబు మీద ఉన్న కోపం తోనే అన్న విషయం మాత్రం ఖచ్చితంగా తెలిసిపోతుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All