Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ పేరు కావాలి కానీ ఎన్టీఆర్ పార్టీ వద్దు

ఎన్టీఆర్ పేరు కావాలి కానీ ఎన్టీఆర్ పార్టీ వద్దు

Jr. Ntr wants only NTR brand not telugu desam partyతాత ఎన్టీఆర్ పేరుని పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ బ్రాండ్ అనే పేరు కావాలి కానీ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ మాత్రం వద్దట ! నోటితో వద్దని చెప్పడం లేదు కానీ తన చేతలతో మాత్రం వద్దని చెప్పకనే చెబుతున్నాడు. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎన్టీఆర్ అక్క సుహాసిని తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసింది అయితే అక్క తరుపున ప్రచారం చేయలేదు ఎన్టీఆర్ . ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు జగన్ పార్టీలో చేరాడు.

 

- Advertisement -

అంతేనా చంద్రబాబు పరిపాలన బాగాలేదని , జగన్ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని చెప్పడం సంచలనం సృష్టించింది. ఇక ఎన్టీఆర్ సన్నిహితుడు కొడాలి నాని ఎప్పుడో జగన్ పంచన చేరాడు. కాగా మరో సన్నిహితుడు వల్లభనేని వంశీ కూడా త్వరలోనే జగన్ పార్టీలో చేరనున్నాడని వార్తలు వస్తున్నాయి. వంశీ వాటిని కనీసం ఖండించడం కూడా లేదు. కొడాలి నాని తెలుగుదేశంని వీడి జగన్ పంచన చేరినప్పుడు అది నాని ఇష్టం దానికి నాకు సంబంధం ఏంటి అన్నాడు ఎన్టీఆర్ , ఇక ఇప్పుడు ఏకంగా పిల్లనిచ్చిన మామనే  జగన్ పార్టీలో చేరాడు అయితే ఇంతవరకు ఎన్టీఆర్ దీనిపై స్పందించలేదు ఏంటో! మొత్తం వ్యవహారం చూస్తుంటే ఎన్టీఆర్ పేరు కావాలి కానీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మాత్రం వద్దనలే ఉంది జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం .

English Title: Jr. Ntr wants only NTR brand not telugu desam party

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All