Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ కు ఆ అర్హత లేదట

ఎన్టీఆర్ కు ఆ అర్హత లేదట

jr ntr sensational comments on grand father ntrమహానటి చిత్రంలో నన్ను తాతయ్య పాత్ర పోషించమని స్వప్న అడగడానికి వచ్చింది కానీ నేను మాత్రం ఆ సాహసం చేయలేదు ఎందుకంటే తాతగారి పాత్ర పోషించే అర్హత నాకు లేదు , ఈ జన్మలో తాతగారి పాత్ర పోషించలేను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ . నిన్న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో మహానటి ప్రీ రిలీజ్ వేడుక జరిగింది కాగా ఆ వేడుకకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరై ఆడియో సిడి లను ఆవిష్కరించి సావిత్రి కూతురు , కొడుకు లకు అందించాడు .

ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ” తాతగారి తో వైజయంతి మూవీస్ సంస్థ ప్రారంభమైందని అలాగే నాతో స్వప్న సినిమా ప్రారంభమైందని మా ద్వారా ప్రారంభించిన ఈ సంస్థలు ఇప్పుడు మహానటి అయిన సావిత్రి గారి బయోపిక్ మహానటి ని నిర్మించడం సంతోషించతగ్గ విషయం . ఈ సినిమాతో అశ్వనీదత్ గారితో పాటుగా ఆయన కుమార్తెలకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు వస్తాయని , రావాలని ఆశిస్తున్నామన్నారు . తాతయ్య పాత్ర ని ఈ మహానటి సినిమాలోనే కాదు ఈ జన్మ ని కూడా పోషించే అర్హత నాకు లేదు అంటూ ఎన్టీఆర్ చెప్పిన మాట మాత్రం మరోలా ధ్వనించింది . ఆ మాటలో ఏదో గూడార్ధం ఉన్నట్లు తోస్తుంది . మహానటి ఈనెల 9న విడుదల అవుతోంది . మహానటిగా కీర్తి సురేష్ నటించగా జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ , విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ , మధురవాణి పాత్రలో సమంత నటిస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All