Homeటాప్ స్టోరీస్కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటూ నినాదాలు

కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటూ నినాదాలు

కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గోల గోల చేసారు . నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అందజేయడానికి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారు . ఇక పలువురు సినీ ప్రముఖులు ఎన్టీఆర్ కు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పడానికి క్యూ కట్టారు . అలాగే సోషల్ మీడియాలో అయితే ఎన్టీఆర్ ట్రేండింగ్ అయ్యింది .

- Advertisement -

ఇక అత్యుత్సాహంతో జూనియర్ అభిమానులు కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున చేసిన నినాదాలు సంచలనం సృష్టిస్తున్నాయి . ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లో తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే దిక్కు అనేలా చేసారు బుడ్డోడి అభిమానులు . తెలంగాణలో ఇప్పటికే తెలుగుదేశం ఖాళీ అయ్యింది భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ జవసత్వాలు అందించాలంటే కేవలం ఎన్టీఆర్ అనే ఉద్దేశ్యంతో కాబోలు ఇలా అరిచి గోల చేసి ఉంటారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All