Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ని అవమానించాడని బూతులు తిడుతున్నారు

ఎన్టీఆర్ ని అవమానించాడని బూతులు తిడుతున్నారు

jr ntr fans fires on aadarsh balakrishna నెగెటివ్ పాత్రలు పోషించే ఆదర్శ్ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని అవమానించాడని అతడ్ని బూతులు తిడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ . తాజాగా ఆదర్శ్ బాలకృష్ణ కు ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు . నిన్న ఆదివారం రోజున షూటింగ్ లో పాల్గొన్నాడు ఆదర్శ్ బాలకృష్ణ . నా కల నిజమైందని త్రివిక్రమ్ సార్ దర్శకత్వంలో నటించే అదృష్టం దొరికిందని ట్వీట్ చేసాడు అయితే అదే ట్వీట్ లో ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ అని మాత్రమే సంబోదించగా త్రివిక్రమ్ ని మాత్రం సర్ అని సంబోదించాడు ఆదర్శ్ బాలకృష్ణ .

అంతే ! జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎక్కడా లేని కోపం వచ్చింది ఆదర్శ్ బాలకృష్ణ పై , జూనియర్ ఎన్టీఆర్ అని ఏకవచనం తో సంబోదిస్తావా ? ఎన్టీఆర్ ని అన్నా అని అను లేకపోతే సార్ అని అను అంతేకాని జూనియర్ ఎన్టీఆర్ అని అంటావా అంటూ ఆదర్శ్ బాలకృష్ణ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు . కొంతమంది ఫ్యాన్స్ అయితే రెచ్చిపోయి బూతులు కూడా తిడుతున్నారు ఈ నటుడిని . తెలుగులో నెగెటివ్ పాత్రలు పోషిస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు ఆదర్శ్ బాలకృష్ణ . ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ రావడంతో బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాడు కట్ చేస్తే బ్రేక్ సంగతి దేవుడెరుగు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతిలో మాత్రం తిట్లు తింటున్నాడు .

- Advertisement -

English Title: jr ntr fans fires on aadarsh balakrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All