Homeటాప్ స్టోరీస్కొమరం భీం గా ఎన్టీఆర్

కొమరం భీం గా ఎన్టీఆర్

Jr. NTR as komaram bheem in Rajamouli's RRR యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో . ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన జక్కన్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా ప్రకటించాడు . తెలుగు , తమిళ , హిందీ , మలయాళ , కన్నడ బాషలలో రూపొందనుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటించనున్నాడు . అయితే కొమరం భీం యుక్త వయసులో కొన్నాళ్ల పాటు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏం చేసాడు అన్నది మిస్టరీ గా మారింది అదే అంశాన్ని తీసుకొని సినిమాగా మలుస్తున్నానని పేర్కొన్నాడు జక్కన్న .

 

- Advertisement -

ఇద్దరు నిజమైన పోరాట యోధులు కలిసి పోరాడితే ఎలా ఉంటుందన్న ఊహకు ప్రతిరూపమే ఈ ఆర్ ఆర్ ఆర్ అని ప్రకటించాడు రాజమౌళి . ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు . ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ , సముద్ర ఖని , అలియా భట్ తదితరులు నటిస్తున్నారు . ఎన్టీఆర్ ఈ పాత్ర పోషించడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు .

English Title: Jr. NTR as komaram bheem in Rajamouli’s RRR

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All