
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన ను అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లతో చేయాలనుకున్న ఈ సినిమా చివరికి విజయ్ దేవరకొండ తో ఫైనల్ అయ్యింది. ఈ విషయాన్నీ ఈరోజు అధికారికంగా తెలపడమే కాదు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ ముంబైలో మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ భారీ చిత్రాన్ని చార్మి పూరి జగన్నాథ్ లతో కలిసి శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి నిర్మిస్తున్నారు.
లాండ్ అయిన హెలీకాప్టర్ లోంచి మిలటరీ ఆఫీసర్గా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చారు. బ్యాగ్రౌండ్లో విజయ్ చెబుతున్న మాటలు వినిపిస్తున్నాయి. `సావ్ధాన్ … ఇండియన్స్ ఆర్ టైగర్స్.. ఇండియన్స్ ఆర్ ఫైటర్స్.. ఇండియన్స్ కెన్ రూల్ దిస్ వరల్డ్… అనగానే `జనగణమన… అంటూ టైటిల్ సాంగ్ మొదలైంది.
మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు.
దేశ భక్తి ప్రధానంగా ఓ మిలటరీ ఆఫీసర్ కథగా రూపొందిస్తున్న ఈ మూవీని 2023 ఆగస్టు 3న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో చిత్రీకరించబోతున్నట్లు తెలిపారు.