Homeటాప్ స్టోరీస్షూటింగ్ కంప్లీట్‌..ఎమోష‌న‌ల్ అయిన హీరో!

షూటింగ్ కంప్లీట్‌..ఎమోష‌న‌ల్ అయిన హీరో!

షూటింగ్ కంప్లీట్‌..ఎమోష‌న‌ల్ అయిన హీరో!
షూటింగ్ కంప్లీట్‌..ఎమోష‌న‌ల్ అయిన హీరో!

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి ప‌లు భాష‌ల మేక‌ర్స్‌ని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం ఈ మూవీని ఇదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో షాహీద్‌క‌పూర్ హీరోగా న‌టిస్తున్నారు. తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ `అర్జున్‌రెడ్డి`ని రీమేక్ `క‌బీర్‌సింగ్‌`లో న‌టించి సంచ‌ల‌నం సృష్టించిన షాహీద్‌క‌పూర్ మ‌రోసారి తెలుగు రీమేక్‌నే ఎంచుకున్నారు.

తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా షాహీద్‌క‌పూర్ భావోద్వేగానికి లోన‌య్యారు. “జెర్సీ` షూటింగ్ పూర్త‌యింది. కోవిడ్ టైమ్‌లో 47 రోజుల పాటు షూటింగ్ చేశాం. షూటింగ్ పూర్త‌యిందంటే న‌మ్మ‌లేకుండా వున్నాను. ఇది మాకు చాలా ట‌ఫ్ టైమ్‌. టీమ్‌ని చూస్తే గ‌ర్వంగా వుంది. ఇది మిరాకిల్ క‌న్నా ఎక్కువే.  ప్ర‌తీ రోజు త‌మ జీవితాల్ని ప‌ణంగా పెట్టి సెట్‌లోకి ఎంట‌రై తాము ఇష్ట‌ప‌డే ప‌ని కోసం వ‌చ్చినందుకు ఈ సంద‌ర్భంగా ప్ర‌తీ ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను` అని షాహీద్ క‌పూర్ భావోద్వేగానికి లోన‌య్యారు.

- Advertisement -

“జెర్సీ`హృదయాలను తాకే ఓ అంద‌మైన క‌థ‌. త‌న‌ని తాను గెలిపించుకుని జీవితంలో అజేయుడిగా నిలిచిన ఓ విజేత క‌థ‌.  నేను చాలా డీప్‌గా క‌నెక్ట్ అయిన స్టోరీ ఇది. అందుకే నా బెస్ట్‌ని ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాను` అని సోష‌ల్ మీడియాలో షాహీద్ క‌పూర్ రాసుకొచ్చారు. ఈ చిత్రానికి మాతృక కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇది అత‌ని తొలి బాలీవుడ్ ఫిల్మ్‌. అల్లు అర‌వింద్,‌ దిల్‌రాజు, అమ‌న్ గిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All