రాజశేఖర్ కు అమ్మాయిల పిచ్చి , జీవితే స్వయంగా అమ్మాయిలను మాట్లాడి రాజశేఖర్ దగ్గరకు పంపిస్తుంది అని మహిళా సంఘం నేత సంధ్య చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసింది జీవితా రాజశేఖర్. సంధ్య చేసిన ఆరోపణలు నిరూపించకపోతే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది జీవిత. శ్రీరెడ్డి విషయాన్ని అనవసరంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దది చేసిందని దాని వల్లే ఇంత రచ్చ రచ్చ అయ్యిందని మా పై ఆగ్రహం వ్యక్తం చేసింది జీవిత.
మాది అన్యోన్యమైన దాంపత్యం అని అలాంటిది మా పై ఆరోపణలు చేయడం ఏంటని ….. కొంతమంది ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టేవాళ్లు ఉంటారని అంత మాత్రం చేత సినిమా వాళ్ళందరిని చెడ్డవాళ్ళ ని చేయడం తగదని , అయినా మంచి చెడు అనేది ప్రతీ రంగంలో ఉన్నదని తేల్చిచెప్పింది జీవిత . అంతేకాదు సంధ్య పై పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టింది.