
ఏపీ సర్కార్ మరోసారి పవన్ కళ్యాణ్ ఫై కక్ష్య సాధింపు చర్య చేస్తుంది. రాజకీయంగా పవన్ వల్ల ఇబ్బంది ఎదుర్కొటున్న జగన్ సర్కార్ ..పవన్ కళ్యాణ్ ను సినిమాల పరంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన గత చిత్రం వకీల్ సాబ్ రిలీజ్ టైం లో ఎలాగైతే డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బంది పెట్టారో..ఇప్పుడు మరోసారి భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బందికి గురి చేస్తున్నారు. బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వకపోవడం..రద్దైన జీవో 35 ని అమల్లోకి తీసుకొస్తూ తక్కువ ధరలకే సినిమా టికెట్స్ అమ్మేలా చేయడం..తనిఖీల పేరుతో థియేటర్స్ యాజమాన్యాలను భయపెట్టడం వంటివి చేస్తున్నారు. జగన్ సర్కార్ చేస్తున్న ఈ పనికి అభిమానులే కాదు రాజకీయ నేతలు సైతం మండిపడుతున్నారు.
గురువారం తెలుగు దేశం నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి జగన్ ఫై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ ఫై ఉన్న కోపం తో చిత్రసీమ ను నమ్ముకున్న వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారు. జగన్‌తో చిత్ర పరిశ్రమ భేటీ రోజు చిరంజీవిగారు దండం పెట్టడం చూసి ఏడుపొచ్చింది. ఆయన కింది స్థాయి నుంచి వచ్చి స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ధీనంగా సినిమా పరిశ్రమ బాగు గురించి దండం పెట్టి అడిగాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తావా? జగన్.. నువ్వు పవన్‌కల్యాణ్‌ను ఏమీ చేయలేవు. కక్ష సాధింపు వల్ల థియేటర్ ముందు పల్లీలు అమ్ముకునే వారి నుంచి నిర్మాత వరకూ ఇబ్బంది పడుతున్నాడు. పేదవాడికి సినిమా రూపంలో అందే వినోదాన్ని కూడా అందనివ్వడం లేదు ఈ ప్రభుత్వం. జగన్ నీ పద్దతి మార్చుకో ‘ అని హెచ్చరించారు.