
పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి . పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సరిపోడని , అతడ్ని చూడటానికి జనాలు వస్తారు కానీ ఓట్లు వేసేందుకు కాదని వ్యాఖ్యానించి పవన్ ని చులకన చేసాడు జేసీ . సినిమా వాళ్ళు ఎంత పెద్ద స్టార్ లైనా సరే వాళ్ళని చూడటానికి జనాలు వస్తారు తప్ప ఓట్లు వేయడానికి కాదని నేను గతంలోనే చెప్పాను . అదే చిరంజీవి విషయంలో జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా జరిగింది అంటూ సెలవిచ్చాడు .
చూసేందుకు వచ్చే ప్రజలు ఓట్లు కూడా వేస్తారని భ్రమ పడుతున్నారని అందుకే పార్టీలు పెట్టారని , ఫలితం చూసాక ఇప్పుడు అర్థమై ఉంటుందని సినిమాలు వేరు , రాజకీయం వేరని పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు జేసీ . ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే లోకేష్ కు పార్టీ బాధ్యతలు ఇస్తే మొత్తం పార్టీ కనుమరుగు అవడం ఖాయమని దాన్ని బ్రతికించాలంటే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ వల్లే అవుతుందని మరో బాంబ్ పేల్చాడు జేసీ దివాకర్ రెడ్డి .