
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా మే 6న రిలీజ్ చేయబోతున్నారు. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈరోజు చిత్ర ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ విడుదల చేసి సినిమా ఫై ఆసక్తి పెంచారు.
గతంలో రామ్‌చరణ్ రిలీజ్ చేసిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కి, నాని రిలీజ్ చేసిన తొలి పాటకి, రానా దగ్గుబాటి విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన రాగా..ఈరోజు విడుదలైన ట్రైలర్ అంతకు రెట్టింపు ఉండడం తో సుమ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
‘రా బావా.. మా ఊర్లో పంచాయితీ సూద్దువ్ గానీ.. ఏ ఊర్లో జరగని ఎరైటీ గొడవ ఒకటి జరుగుతోంది’ అని చెప్పడంలో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఇద్దరు ఆడ పిల్లల తల్లి అయిన జయమ్మ (సుమ) గ్రామ పంచాయతీ ముందు ఓ సమస్యను లేవనెత్తగా.. అది ఆ గ్రామంలో బలమైన ప్రభావాన్ని చూపిందని అర్థం అవుతుంది.
జయమ్మ భర్త (దేవీ ప్రసాద్) అనారోగ్యంతో బాధ పడుతూ ఉండగా.. ఆమె తన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి ఒక బలమైన నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. తన నిర్ణయానికి కట్టుబడి ఆ గ్రామంపై కూడా పోరాడేందుకు ఆమె సిద్ధమైంది. ఒక పూజారి మరియు అతని ప్రేయసి మధ్య జరిగే ప్రేమకథ.. ఒక టీనేజ్ అబ్బాయి – అమ్మాయి మధ్య స్నేహం వంటివి ఈ ట్రైలర్ లో చూపించడం జరిగింది. జయమ్మగా సుమ తన అభినయంతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర యొక్క అసాధారణమైన క్యారక్టరైజేషన్ కు అందరూ ఈజీగా కనెక్ట్ అవుతారు. ‘ఎవరి వల్ల సెడ్డావురా వీరన్నా అంటే.. నోటి వల్ల సెడ్డానురా కాటమరాజా అన్నాడంట’ అంటూ సుమ తనదైన శైలిలో పలికే సంభాషణలు అలరిస్తున్నాయి. ఇక మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.
ఇక ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా..అనూష్ కుమార్ కెమెరా వర్క్ చేసారు. ఇక విజయలక్ష్మి సమర్పణలో విడుదలవుతున్న ఈ సినిమాకు అమర్-అఖిల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవరించారు.