
కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో వరుస సినిమాలు చేసిన సుమ .. ఆ తర్వాత బుల్లితెరకు పరిమితమైంది. గత 15 ఏండ్లుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్‌గా రాణిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం అగ్ర నిర్మాతలు వేచి చూస్తుంటారు. ఏదైనా ఈవెంట్ జరగాలి అంటే అందులో సుమ యాంకర్ అయితే చాలు.. ప్రోగ్రామ్ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం అందరిలోనూ కలిగించింది ఈమె. అందుకే ఈమె ఎంత రెమ్యూనరేషన్ అడిగిన ఇచ్చి ఆమెతో ఈవెంట్ చేయించుకుంటారు. అలాంటి సుమ ఇప్పుడు మళ్లీ వెండితెర ఫై రీ ఎంట్రీ ఇస్తుంది.
సుమ కనకాల ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయతీ’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విలేజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందించబడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణని సంపాదించాయి. అయితే ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలన్నీ రిలీజ్ కి ఉన్నాయి. ఈ భారీ సినిమాల మధ్యలో సుమ ‘జయమ్మ పంచాయితీ’ రిలీజ్ చేయడానికి సిద్ధమైంది.
ఏప్రిల్ 22న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి సుమ తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో డేట్స్ అన్ని స్టార్ హీరోల సినిమాలతో బుక్ అయిపోయాయి నేనెప్పుడు రిలీజ్ చేయాలి అంటూ డేట్ ని అనౌన్స్ చేస్తుంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ఎవరికీ, దేనికీ లొంగని నిస్వార్థపూరిత మహిళగా సుమ నటించారు.ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, అనూష్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధను అండ్లూరి (విఖ్యాత చిత్రకారులు) ఆర్ట్ డైరెక్షన్ చేశారు.