
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ”జయలలిత” గారి జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా తెరకెక్కపోతుంది. సినిమాకి దర్శకులుగా “ఏ.ఎల్.విజయ్” బాధ్యతలు చేపట్టారు. ‘కంగనా రనౌత్’ కథానాయకి అని విన్నాం. అయితే కంగనా రనౌత్ ని ఏ మాత్రం సరిపోని జయలలిత గారి క్యారక్టర్ కి తీసుకోవటం ఏంటి అని ఆశర్యపోయారు.. అలా అందరూ అనేసరికి కంగనా రనౌత్ ని ట్రైనింగ్ కి పంపించేశారు.
నిజానికి ‘కంగనా రనౌత్‘ గారిది ఫిట్నెస్ బాడీ. నటన పరంగా చేయొచ్చు ఏమో గాని ఆకారం పరంగా చేయలేదు అన్నప్పుడు ఈ సినిమా తెరకెక్కడం కష్టం అనుకున్నారు. కానీ డిసెంబర్ మొదటి వారం నుండి సినిమా మొదలు కాబోతుంది. ఈ లోపు మిగిలిన తారాగణం పైన కసరత్తులు చేస్తున్నారు దర్శకులు. ఈ సినిమాకి రచయిత బాధ్యతలు ‘విజయేంద్ర ప్రసాద్’ గారు చేపట్టారు.
సినిమాని తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో ఏకధాటిగా విడుదల చెయ్యాలి అని నిర్మాతలు విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ గారు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. అయితే దర్శకుడిగా తెలుగులో మంచి పేరు సంపాదించలేకపోయాడు విజయ్. ఇదివరకే ‘అభినేత్రి’, ‘అభినేత్రి-02’, ‘కణం’ సినిమాలని తీశారు. కానీ అవి ఇక్కడ బోల్తాకొట్టాయి. ఈ సారి ఎలాగైనా తెలుగులో హిట్ కొట్టాలి అని బాగా గట్టిగా కసరత్తులు చేస్తూ…. మిగిలిన తారాగణం మీద ఫోకస్ పెట్టేసారు.
జయలలిత జీవితం అంటే బాల్యం నుండి, సినిమాలలో కథానాయకి, తర్వాత రాజకీయ రంగప్రవేశం ఎలా చేసింది?….. ఆమె జీవితంలో ముఖ్యమైన వారిని కూడా చూపించాలి కాబట్టి ‘అరవింద్ స్వామి‘ గారిని ఎం.జి.ఆర్ [మరుతూర్ గోపాల రామచంద్రన్] పాత్రలో చూపించాలి అని ఫిక్స్ అయ్యారంటా… దానికి అరవింద్ స్వామి గారు కూడా ఒకే చెప్పారంటా. అరవింద్ స్వామి గారు ‘ధ్రువ’ సినిమాలో చేసిన పాత్ర ని ఎలా మర్చిపోగలము చెప్పండి. జయలలిత సినిమాలో తనకి ఈ ఎం.జి.ఆర్ పాత్ర దొరకటం అదృష్టం అని చెప్పాలి.