Homeటాప్ స్టోరీస్జాతి రత్నాలు భామకు ఎట్టకేలకు మరొకటి!!

జాతి రత్నాలు భామకు ఎట్టకేలకు మరొకటి!!

జాతి రత్నాలు భామకు ఎట్టకేలకు మరొకటి!!
జాతి రత్నాలు భామకు ఎట్టకేలకు మరొకటి!!

జాతి రత్నాలు ఎంతటి సెన్సేషనల్ హిట్ అయిందో మనందరం చూసాం. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ద్వారా నవీన్ పోలిశెట్టికు మంచి పేరు రాగా ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఫరియా అబ్దుల్లాకు కూడా అంతే మంచి పేరొచ్చింది. రెగ్యులర్ హీరోయిన్ల లుక్ కు భిన్నంగా కనిపించే ఫరియా, పెర్ఫార్మన్స్ పరంగా మాత్రం మెప్పించింది.

ఆమె టాలెంట్ కు టాలీవుడ్ లో అవకాశాలు బాగానే వస్తాయని అనుకున్నారు అందరూ. కానీ రీసెంట్ గా విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లో చిన్న క్యామియో తప్ప ఫరియా ఏ సినిమాలో కనిపించలేదు. రవితేజ సరసన నటిస్తోంది అన్నారు కానీ అది నిజం కాలేదు. అయితే మొత్తానికి ఫరియాకు ఒక మంచి అవకాశం దక్కినట్లు సమాచారం.

- Advertisement -

శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ఢీ అండ్ ఢీ. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఢీ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫరియా ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు పెద్దగా అవకాశాలు లేని నేపథ్యంలో ఇది మంచి అవకాశమని చెప్పుకోవాలి. మరి ఈ చిత్రం ద్వారా అయినా ఆమె బిజీ అవుతుందేమో చూడాలి.

Also Read:
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All