Tuesday, August 16, 2022
Homeటాప్ స్టోరీస్ప‌వ‌న్ కోసం హాట్ హీరోయిన్?

ప‌వ‌న్ కోసం హాట్ హీరోయిన్?

ప‌వ‌న్ కోసం హాట్ హీరోయిన్?
ప‌వ‌న్ కోసం హాట్ హీరోయిన్?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత సినిమాలు చేస్తున్నా ఆయ‌న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. అందుకే క్రిష్ ఆయ‌న క్రేజ్‌కి త‌గ్గ‌ట్టే పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన భారీ సెట్ల నిర్మాణం గ‌చ్చిబౌలీలోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో జ‌రుగుతోంది. తాజ్‌మ‌హ‌ల్ సెట్‌తో పాటు చార్మినార్‌, వాట‌ర్ ఫాల్స్ సెట్‌ని కూడా నిర్మిస్తున్నారు. అన్నీ పూర్త‌యితే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని క్రిష్ భారీ గానే ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ బందిపోటు దొంగ పండుగ‌ల సాయ‌న్న‌గా క‌నిపించ‌బోతున్నారు. జాన‌ప‌ద చిత్రాల లుక్‌లో ఈ సినిమా వుండే అవ‌కాశం క‌నిపిస్తోంది. అంతేనా మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల క‌థ‌, కోహినూర్ వ‌జ్రం చుట్టూ ఈ చిత్ర క‌థ సాగుతుంద‌ని తెలుస్తోంది.

అయితే ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా ప‌లువురిని ప‌రిశీలించిన క్రిష్ ఈ చిత్రం కోసం శ్రీ‌లంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని రంగంలోకి దింపుతున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆమెతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, భారీ మొత్తం ఆఫ‌ర్ చేయ‌డంతో ఇద్ద‌రు హీరోయిన్‌ల‌లో ఓ హీరోయిన్‌గా న‌టించ‌డానికి జాక్వెలిన్ అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. దిషా ప‌టానిని కూడా సంప్ర‌దించిన క్రిష్ ఫైన‌ల్‌గా జాక్వెలిన్‌ని ఫైన‌ల్ చేసిన‌ట్లు వినిపిస్తోంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts